ETV Bharat / state

ప్రభుత్వ దవాఖానాల్లో పడకలు ఖాళీగా ఉన్నా.. రోగులకు సేవల్లేవు! - కరోనా తాజా వార్తలు

రాజధాని నగరంలో కరోనా వైరస్‌ అనేక ప్రాంతాలకు విస్తరిస్తోంది. హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లో నిత్యం సుమారు 800 మంది వరకు దీని బారినపడుతున్నారు. వీరంతా నగరంలోని ప్రధానమైన ప్రభుత్వ ఆసుపత్రుల్లో చేరి వైద్య సహాయం పొందడానికి సిద్ధంగా ఉన్నారు. అటువంటప్పుడు వీటిలోని వేలాది పడకలు రోగులతో నిండిపోవాలి. అయినా 2429 పడకల వరకు ఖాళీగా ఉన్నాయి. దీనికి కారణాలపై ‘ఈనాడు’ వివిధ దవాఖానాల్లో పరిస్థితిని పరిశీలించినపుడు అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి.

Beds in Hyderabad government hospitals are empty but not serviced
ప్రభుత్వ దవాఖానాల్లో పడకలు ఖాళీగా ఉన్నా.. రోగులకు సేవల్లేవు!
author img

By

Published : Aug 13, 2020, 11:45 AM IST

ప్రధానంగా 5 ప్రభుత్వ దవాఖానాల్లో 3737 పడకలు కరోనా బాధితుల కోసం ఏర్పాటుచేశారు. 1308 పడకల్లో రోగులు ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. మిగిలినవన్నీ ఖాళీనే. గ్రేటర్‌ మూడు జిల్లాల రోగులతోపాటు ఇతర జిల్లాల నుంచి అనేకమంది ఇక్కడకు వచ్చి చికిత్సకు పొందడానికి మక్కువ చూపిస్తున్నారు. రోజూ కనీసం 1400 మందికి వైద్యం అందించాల్సిన పరిస్థితి. ఆర్థిక తోడ్పాటులేని వేలాదిమంది ముందుగా పరుగులు తీసేది గాంధీ, టిమ్స్‌, కింగ్‌కోఠి, ఫీవర్‌, ఛాతీ ఆసుపత్రులకే.

గాంధీ: ఇక్కడ 790 మంది కరోనా రోగులు ఉన్నారు. మరో 1100 మందికి చికిత్స అందించేందుకు వీలుగా పడకలు ఉన్నాయి. ఇక్కడ ఉన్నవారిలో దాదాపు 500 మంది తీవ్రమైన వ్యాధి లక్షణాలతో ఉన్నారు. చాలామంది వెంటిలేటర్‌పై ఉండటంతో వైద్యులు వారిపైనే దృష్టిసారించారు. పెద్ద సంఖ్యలో రోగులను చేర్చుకుంటే విషమంగా ఉన్నవారిపై దృష్టిసారించలేమన్న ఉద్దేశంతో.. వందలమంది వస్తున్నా సరే ఔషధాలిచ్చి హోం ఐసోలేషన్‌లో ఉండాలంటూ పంపేస్తున్నారు. ఇలా తిరిగి వెళ్లినవారిలో పలువురికి రెండు రోజులకే ఆరోగ్యం విషమించి ప్రైవేటు ఆసుపత్రులకు పరుగులు తీయాల్సి వస్తోంది.

ఫీవర్‌ ఆసుపత్రి: ఇక్కడ 100 పడకలుంటే వైద్యం పొందుతున్న కరోనా రోగుల సంఖ్య 13 మంది. అనేకమంది చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నా పడకలు లభించడం లేదు.

టిమ్స్‌: గచ్చిబౌలి టిమ్స్‌ ఆసుపత్రిలో 1261 పడకలున్నా 209 మంది రోగులే వైద్యం పొందుతున్నారు. మిగిలినవన్నీ ఖాళీ. అక్కడ విస్తృత స్థాయిలో సేవలందించేందుకు వీలుగా వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బంది సరిపడా లేరు. దీంతో టిమ్స్‌ అలంకారప్రాయంగా మారిందనే విమర్శలు ఉన్నాయి.

కింగ్‌కోఠి, ఛాతీ ఆసుపత్రులు: రోగులను పరీక్షించి ‘గాంధీకి వెళ్లండి’ అంటూ పంపిస్తున్నారు. గాంధీకి వెళ్తే ‘మీ పరిస్థితి బాగానే ఉంది, ఇంట్లో మందులు వాడండి’ అని సూచిస్తున్నారు.

కనీస సహాయం అందిస్తేనే...

అసలే కరోనా వచ్చిందన్న ఆందోళనతో ఉన్న రోగులు తమ వేదన ఎవరికి చెప్పుకోవాలో తెలియక సతమతమవుతున్నారు. పాజిటివ్‌తో దవాఖానాలకు వచ్చినవారిలో దగ్గు, జలుబు వంటి లక్షణాలు తీవ్రంగా ఉంటే వారిని చేర్చుకొని కనీసం రెండు రోజులైనా తగిన వైద్య సహాయం అందించి.. తగిన సూచనలతో ఇంటికి పంపిస్తే ఫలితముంటుందని నిపుణులు సూచిస్తున్నారు. అప్పుడే వారు ధైర్యంగా ఇంట్లోనే తగిన జాగ్రత్తలతో కోలుకునే అవకాశముందన్నారు. మరోవైపు రోగులకు కాల్‌సెంటర్లు సైతం తగిన అండనివ్వలేకపోతున్నాయి.

ఆసుపత్రి.. మొత్తం రోగులతో ఖాళీగా
పడకలు నిండినవి ఉన్నవి
గాంధీ 1890 790 1100
టిమ్స్‌ 1261 209 1052
కింగ్‌కోఠి350 171 179
ఫీవర్‌ 100 13 87
ఛాతీ ఆసుపత్రి 136 125 11
మొత్తం 3737 1308 2429

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.