డిమాండ్ల సాధన కోసం ఉద్యమాలు చేస్తున్న క్షేత్ర సహాయకుల పట్ల ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవరిస్తోందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ఆరోపించారు. 7,610 మంది ఫీల్డ్ అసిస్టెంట్లను విధుల నుంచి తొలగించడాన్ని ఆయన తప్పుపట్టారు. ఆ కారణంతోనే 21 మంది క్షేత్రసహాయకులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇప్పటివరకు ఈ ఉద్యమాన్ని తాము రాజకీయం చేయలేదని కృష్ణయ్య పేర్కొన్నారు. ప్రభుత్వం స్పందించి వారిని ఉద్యోగాల్లో చేర్చుకోకపోతే రాజకీయపరమైన ఉద్యమానికి తెర తీస్తామని హెచ్చరించారు.
ఇదీ చూడండి: 'పంచాయతీరాజ్ వ్యవస్థను కేసీఆర్ ప్రభుత్వం నాశనం చేస్తోంది'