ETV Bharat / state

'ఉగాండా'లో ఘనంగా బతుకమ్మ వేడుకలు.. ఆడిపాడిన మహిళలు - Tirumala Tirupati Devasthanam Uganda Latest News

Bathukamma Celebrations in Uganda: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే బతుకమ్మ సంబురాలు ఎల్లలు దాటాయి. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో స్థిరపడిన తెలుగు ప్రజలు బతుకమ్మ వేడుకలను వైభవంగా జరుపుకుంటున్నారు. ఉగాండా రాజధాని కంపాలాలో బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు.

Bathukamma Festivals in Uganda
Bathukamma Festivals in Uganda
author img

By

Published : Oct 2, 2022, 4:45 PM IST

ఉగాండాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు

Bathukamma Celebrations in Uganda: ఉగాండా రాజధాని కంపాలాలో తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ ఉగాండా ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలను వైభవంగా నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఉగాండా ప్రాంగణంలో బతుకమ్మ సంబురాలను ఘనంగా జరుపుకున్నారు. ఈ వేడుకల్లో ప్రాంతాలకు అతీతంగా తెలుగువారు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. తీరొక్క పూలతో మహిళలు బతుకమ్మలను అందంగా పేర్చారు. పెద్ద సంఖ్యలో హాజరై ఆడిపాడి సందడి చేశారు.

రెండు గంటల పాటు ఈ వేడుకలు కొనసాగాయి. అనంతరం బతుకమ్మలను పక్కనే ఉన్న కొలనులో వేసిన మహిళలు.. పోయిరా బతుకమ్మ మళ్లీ రావమ్మా అంటూ వీడ్కోలు పలికారు. ఈ బతుకమ్మ సంబురాలను, తెలంగాణ సంస్కృతిని చూసి అక్కడి వారు హర్షం వ్యక్తం చేశారు. మున్ముందు జరిగే సంబురాలలో తామూ పాల్గొంటామని తెలిపారు.

వచ్చే ఏడాది నుంచి బతుకమ్మ సంబురాలను మరింత ఘనంగా నిర్వహిస్తామని తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ ఉగాండా నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవస్థాపక అధ్యక్షులు వేణుగోపాల్ రావు, ఛైర్మన్ కోటిరెడ్డి, ట్రస్టీ పార్థసారథి, జనరల్ సెక్రటరీ వసంత్ కుమార్, వైస్ ఛైర్మన్లు చంద్రకాంత్, రఘువీర్, హిరన్మయి, కల్చరల్ సెక్రటరీ పూజిత, మురళి, కార్యవర్గ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

ఇవీ చదవండి: మలేషియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.. హాజరైన తెలంగాణ ప్రముఖులు

మహాత్మా గాంధీకి ఘన నివాళి.. ముర్ము, మోదీ, సోనియా పుష్పాంజలి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.