న్యూజిలాండ్‌లో బతుకమ్మ సంబురాలు అంబరాన్నంటాయి. ఆ దేశ ఎంపీ ప్రియాంక రాధాకృష్ణ సిరిసిల్ల చీర కట్టుకుని బతుకమ్మ వేడుకల్లో పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. తెలంగాణ అసోషియేషన్ ఆఫ్ న్యూజిలాండ్ ఏర్పాటు చేసిన బతుకమ్మ వేడుకల్లో సిరిసిల్ల చీరకట్టుకుని ప్రచారకర్తగా ముందుకు వచ్చారని బ్రాండ్ తెలంగాణ వ్యవస్థాపకురాలు సునీత విజయ్ పేర్కొన్నారు. ప్రియాంక రాధకృష్ణ తెలుగులో ప్రతి ఒక్కరికి బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు.

ఇదీ చూడండి: ప్రధాని సోదరుడి కుమార్తె పర్స్ కొట్టేసిన దొంగలు అరెస్ట్