హైదరాబాద్ నాంపల్లిలోని రాష్ట్ర భాజపా కార్యాలయం వద్ద ఆత్మహత్యకి యత్నించిన శ్రీనివాస్‌ను మెరుగైన వైద్యం కోసం ఉస్మానియా నుంచి సికింద్రాబాద్ యశోదా ఆస్పత్రికి తరలించినట్లు రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చెప్పారు. దుబ్బాక ఉప ఎన్నిక ప్రచారంలో ఉన్న తాను విషయం తెలియగానే హుటాహుటిన నగరానికి వచ్చినట్లు పేర్కొన్నారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో ఉన్న శ్రీనివాస్ ఈ రోజే బయటకు వచ్చారని అన్నారు. ధర్మం పట్ల మంచి అవగాహన కలిగిన వ్యక్తి అని కొనియాడారు.
ఇబ్రహీంపట్నం యాచారానికి చెందిన యువకుడు శ్రీనివాస్.. కార్యాలయం వద్ద పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. 58 శాతం మేర గాయాలైనట్లు ఉస్మానియా వైద్యులు తెలిపారు.
'ఎమ్మెల్యే అభ్యర్థి రఘునందన్ రావు బంధువుల ఇంట్లో జరిగిన తనిఖీలో ఉద్రిక్తలు నెలకొన్నాయి. ఆ సమయంలో నన్ను పోలీసులు ఆరెస్టు చేశారు. ఈ విషయాన్ని సామాజిక మాద్యమాల ద్వారా శ్రీనివాస్ ఆలస్యంగా తెలుసుకున్నారు.'
బండి సంజయ్, రాష్ట్ర భాజపా అధ్యక్షుడు
ఓబీసీ జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి.. శ్రీనివాస్‌ను పరామర్శించినట్లు బండి సంజయ్ వెల్లడించారు.
ఇదీ చదవండి: పరిహారంలో నిర్లక్ష్యం.. రహదారి విస్తరణ పనుల్లో జాప్యం