ETV Bharat / state

'KTR నోటీసులపై బండి సంజయ్ స్పందన.. ఆయన పరువు ఖరీదు రూ.100కోట్లా?'

Bandi Sanjay Responded to KTR Legal Notice: మంత్రి కేటీఆర్‌ లీగల్‌ నోటీసులపై బండి సంజయ్ స్పందించారు. వీటిని లీగల్​గానే ఎదుర్కొంటామని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే కేటీఆర్ పరువు ఖరీదు రూ.100కోట్లా అని ప్రశ్నించారు. మరీ యువత భవిష్యత్ మూల్యమెంతో కేటీఆర్‌ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

Bandi Sanjay
Bandi Sanjay
author img

By

Published : Mar 29, 2023, 5:20 PM IST

Bandi Sanjay Responded to KTR Legal Notice: టీఎస్​పీఎస్సీ లీకేజీ వ్యవహారంలో తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారంటూ.. రెేవంత్​రెడ్డి, బండి సంజయ్​లకు.. మంత్రి కేటీఆర్ మంగళవారం లీగల్ నోటీసులు పంపించారు. ఆరోపణలపై వారం రోజుల్లో బహిరంగ క్షమాపణ చెప్పకుంటే రూ.100 కోట్లకు పరువు నష్టం దావాను ఎదుర్కొవాల్సి వస్తుందని ఆ నోటీసుల్లో మంత్రి పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ నోటీసులపై బండి సంజయ్ స్పందించారు.

మంత్రి కేటీఆర్ ఉడుత బెదిరింపులకు భయపడేది లేదని.. లీగల్ నోటీసులపై న్యాయపరంగానే పోరాడుతానని బండి సంజయ్‌ స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదన్నారు. మంత్రి పరువు ప్రతిష్టకు భంగం కలిగించినందుకు బహిరంగ క్షమాపణ చెప్పకపోతే వంద కోట్ల పరువు నష్టం దావా వేస్తారని.. తనకు లీగల్ నోటీసు జారీ చేసినట్లు వచ్చిన వార్తను పత్రికల్లో చూసినట్లు చెప్పారు. ఆయన పరువు ఖరీదు రూ.100కోట్లా అని బండి సంజయ్ ప్రశ్నించారు.

యువత భవిష్యత్తు మూల్యమెంతో కేటీఆర్‌ చెప్పాలి?: ఈ క్రమంలోనే యువత భవిష్యత్ మూల్యమెంతో కేటీఆర్‌ చెప్పాలని బండి సంజయ్ ప్రశ్నించాకు. లీకేజీలో తన కుట్ర ఉందని కేటీఆర్‌ ఆరోపించారని.. వాటిపై తాను ఎన్నికోట్లకు దావా వేయాలని పేర్కొన్నారు. పరువు నష్టం పేరుతో కూడా డబ్బులు సంపాదించాలనుకోవడం సిగ్గుచేటన్నారు. ప్రధానమంత్రి స్థాయిని, వయసును కూడా చూడకుండా విమర్శించడం కేటీఆర్ కుసంస్కారానికి నిదర్శనమని ఆరోపించారు.

సాధారణ అంశంగా మలిచేందుకు.. మంత్రుల ప్రయత్నం: ప్రశ్నాపత్రాలు లీకేజీ అంశాన్ని ఒక సాధారణ అంశంగా మలిచేందుకు.. మంత్రులంతా ప్రయత్నం చేస్తున్నారని బండి సంజయ్ మండిపడ్డారు. సిట్ విచారణ అంశాలు అసలు కేటీఆర్​కి ఎలా లీక్ అవుతున్నాయని ప్రశ్నించారు. ప్రశ్నాపత్రాలు పత్రాల లీకేజీ విచారణను ప్రభావితం చేసే విధంగా మంత్రి మాట్లాడుతున్నందుకు.. సిట్ ఎందుకు నోటీసులు ఇవ్వలేదని ప్రశ్నించారు. తప్పిదాలను ప్రశ్నిస్తున్న తమపై చర్యలు తీసుకుంటామంటూ బెదిరిస్తారా అని పేర్కొన్నారు.

సిట్ బెదిరింపులకు భయపడేది లేదు: సిట్ బెదిరింపులకు భయపడేది లేదని బండి సంజయ్ స్పష్టం చేశారు. తాను మళ్లీ చెబుతున్నానని.. జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు జారీ కుంభకోణం నుంచి.. నేటి ప్రశ్నాపత్రాలు లీకేజ్ వరకు ఐటీ శాఖ మంత్రే బాధ్యత వహించాలని పునరుద్ఘాటించారు. నాలాలో పడి పిల్లలు చనిపోయిన దగ్గర నుంచి.. కుక్కల దాడిలో పసిపిల్లల చావు వరకు మున్సిపాలిటీ శాఖ మంత్రే బాధ్యత వహించి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

ప్రశ్నాపత్రాల లీకేజీలో నష్టపోయిన విద్యార్థులకు న్యాయం జరిగేంత వరకు బీజేపీ పోరాటం కొనసాగుతుందని బండి సంజయ్ పేర్కొన్నారు. కేటీఆర్​ను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేసేదాకా ఉద్యమాన్ని కొనసాగిస్తామన్నారు. ప్రశ్నాపత్రాల లీకేజీపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగులకు రూ.లక్ష చొప్పన పరిహారం అందించే వరకు పోరాటాన్ని తీవ్రతరం చేస్తామని.. ఈ మేరకు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నట్లు బండి సంజయ్ తెలిపారు.

ఇవీ చదవండి: రేవంత్​రెడ్డి బండి సంజయ్‌పై రూ100 కోట్ల పరువు నష్టం లీగల్ నోటీసులు పంపిన కేటీఆర్

బీజేపీ కార్యాలయానికి నీలం రంగు... ఎవరి పనై ఉంటుందబ్బా..!

కర్ణాటకలో మోగిన ఎన్నికల నగారా.. పోలింగ్, కౌంటింగ్ తేదీలివే..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.