ETV Bharat / state

భాజపాకు ఓటు వేసి లాయర్ల తడాఖా చూపించండి: బండి సంజయ్​ - నారాయణ గూడాలో బండి సంజయ్​ సమావేశం

న్యాయవాదుల హత్యపై దిల్లీలో ప్రశ్నిస్తుంటే తెలంగాణ పౌరుడిగా తల దించుకునే పరిస్థితి ఎదురైందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ అన్నారు. భాజపా లీగల్​ సెల్​ ఆధ్వర్యంలో నారాయణగూడలోని కేశవ్ మెమోరియల్ కాలేజ్​లో హైకోర్టు న్యాయవాదులతో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు.

bandi sanjay participate in a meeting with layers in narayanguda
భాజపాకు ఓటు వేసి లాయర్ల తడాఖా చూపించండి: బండి సంజయ్​
author img

By

Published : Feb 27, 2021, 8:10 AM IST

రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతోందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. భాజపా లీగల్​ సెల్​ ఆధ్వర్యంలో నారాయణగూడలోని కేశవ్ మెమోరియల్ కళాశాలలో హైకోర్టు న్యాయవాదులతో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో హైదరాబాద్ - రంగారెడ్డి - మహబూబ్ నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి రామచందర్ రావుకు ఓటు వేసి లాయర్లు తమ తడాఖాను చూపించాలని కోరారు.

నడిరోడ్డుపై లాయర్ దంపతుల హత్య జరిగితే.. ఆ ఘటనను ఖండించలేని స్థితిలో ముఖ్యమంత్రి ఉన్నారని బండి సంజయ్​ విమర్శించారు. అలాంటి తెరాస పార్టీకి ఓట్లు వేస్తారా అని న్యాయవాదులను ఆయన​ ప్రశ్నించారు. ఉన్నత చదువులు చదివిన పట్టభద్రుల తీర్పు కోసం యావత్ దేశంలోని సామాన్య ప్రజలు ఎదురుచూస్తున్నారని ఆయన పేర్కొన్నారు. లాయర్ల హత్యపై దేశ రాజధాని దిల్లీలో ప్రశ్నిస్తుంటే... తెలంగాణ పౌరుడిగా తలదించుకునే పరిస్థితి ఎదురైందన్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్​ను, ఎమ్మెల్సీ అభ్యర్థి రామచందర్​ రావును లాయర్లు ఘనంగా సన్మానించారు

ఇదీ చదవండి: జోరుగా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎన్నికల ప్రచారం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.