Telangana BJP Latest News : తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌కు ఆ పార్టీ హైకమాండ్ నుంచి పిలుపు వచ్చే అవకాశముందని ఆ పార్టీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. గత కొద్ది రోజులుగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడి మార్పు జరగనుందనే ఊహాగానాలు వినిపిస్తున్న తరుణంలో.. సంజయ్‌కు కేంద్రమంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. రాష్ట్ర అధ్యక్ష పదవికి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పేరును పరిశీలిస్తున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
ఈ క్రమంలో ఆదివారం హనుమకొండలో బండి సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘మోదీ సభకు అధ్యక్షుడి హోదాలో వస్తానో.. లేదో తెలియదని.. హైకమాండ్ నిర్ణయమే తనకు శిరోధార్యంగా చెప్పుకొచ్చారు. అందరూ కలిసి మోదీ సభను విజయవంతం చేయాలని’ కార్యకర్తలతో అన్నారు. ఈ వ్యాఖ్యలతో ఆ పార్టీ వర్గాల్లో చర్చ జోరుగా నడుస్తోంది. దిల్లీ నుంచి బండి సంజయ్‌కు పిలుపు రావొచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
- Modi Telangana Tour : జులై 12న రాష్ట్రానికి ప్రధాని మోదీ రాక!
- బీజేపీ మాస్టర్ ప్లాన్ రెడీ.. ప్రాంతాలవారీగా ఎన్నికల వ్యూహం.. హైదరాబాద్‌లో కీలక భేటీ
Bandi Sanjay Mumbai tour today : బండి సంజయ్ ఇవాళ ముంబయి పర్యటనకు వెళ్లారు. అక్కడ ముంబ మహాదేవి ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహిస్తారని సమాచారం. బీజేపీ హైకమాండ్ నుంచి ఇవాళ సాయంత్రంలోపు సంజయ్‌కు పిలుపు రావొచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో దిల్లీ నుంచి పిలుపు వస్తే.. బండి సంజయ్ ముంబయి నుంచే నేరుగా దిల్లీ వెళ్లే అవకాశముంది.
Jitender Reddy met with Etela Rajender : మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఇవాళ భేటీ అయ్యారు. అనంతరం మాట్లాడిన జితేందర్ రెడ్డి.. ఈటలతో తనతో ఎలాంటి విబేధాలు లేవని స్పష్టం చేశారు. ఈటలతో పదేళ్లు కలసి ఉద్యమంలో కలసి పని చేసినట్లు గుర్తు చేసుకున్నారు. తన ట్వీట్‌కు వివరణలు ఇవ్వాల్సిన అవసరం లేదని అన్నారు. బీజేపీపై వదంతులు వ్యాప్తి చేయడం ఆపాలని సూచించారు. ఈటలతో తనకు అను బంధాన్ని జితేందర్ రెడ్డి గుర్తు చేసుకున్నారు.
పార్టీని బలోపేతం చేసే నాయకులు ఎవరొచ్చినా మంచిదేనని వ్యాఖ్యానించిన ఆయన.. ఈటెల రాజేందర్‌కు అదనపు బాధ్యతలు ఇస్తే మంచిదేనని సూచించారు. గత కొద్దిరోజులుగా వీరి ఇరువురి మధ్య విభేదాలు నడుస్తున్నట్లు ప్రచారం జరిగిన విషయం తెలిసిందే.. దానికి జితేందర్ రెడ్డి చేసిన ట్వీట్ మరింత బలపరిచగా.. దానిపై ఈటల సైతం స్పందిచడం చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో ఇవాళ ఇరువురి భేటీ ఆ పార్టీ నేతలతోపాటు తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.
ఇవీ చదవండి: