Bandi Sanjay Fires on CM KCR: రాష్ట్రంలో ఏ కార్యక్రమం చేసినా తమ నేతలను అరెస్ట్ చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ఆక్షేపించారు. భవిష్యత్తులో ఈ ప్రభుత్వమే ఉంటే ప్రజలకు చెప్పులు చేతులో పట్టుకోవడమే మిగులుతుందని విమర్శించారు. హైదరాబాద్ నాంపల్లి రాష్ట్ర కార్యాలయంలో బండి సంజయ్ సమక్షంలో సిరిసిల్ల సెస్ మాజీ వైస్ ఛైర్మన్, శ్రీనివాస ఛారిటబుల్ ట్రస్ట్ అధినేత లగిశెట్టి శ్రీనివాస్ బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌కు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆయనతో పాటు పలువురు నేతలు బీజేపీలో చేరారు.
అసెంబ్లీలో కేసీఆర్ ఏం మాట్లాడుతున్నారో ప్రజలంతా గమనిస్తున్నారని బండి సంజయ్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన బడ్జెట్‌పై ప్రజల్లో కనీసం చర్చ లేదని, కేసీఆర్ మాటలు ప్రజలు విశ్వసించడం లేదని ధ్వజమెత్తారు. చేనేత బంధు ఎంత మందికి ఇచ్చారు? ఒక్క బతుకమ్మ చీర ఇచ్చి వారి బతుకు బర్ బాద్ చేశారని మండిపడ్డారు.
ఎన్నికల ముందు ఇచ్చిన హామీలెన్ని..? నెరవేర్చినవి ఎన్ని..? అని ప్రశ్నించారు. కేసీఆర్‌కు వయసు మీద పడింది. అందుకే ఏం మాట్లాడుతున్నాడో అర్థం కావడం లేదని తప్పుపట్టారు. పోడు పట్టాలు ఇస్తానని ఎనిమిదిన్నరేండ్లుగా ఇవ్వలేదు.. ఇప్పుడు ఇస్తామని అంటున్నారు. ఇన్ని రోజులు దస్త్రం ఎందుకు ఆపారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పోడుభూములకు ఎలాంటి లింకులు పెట్టకుండా పట్టా ఇవ్వాల్సిందే.. లేదంటే పేద ప్రజలు నీ ఫామ్ హౌజ్ దున్నడం ఖాయం అని ఆయన హెచ్చరించారు.
"పోడు వ్యవసాయం చేయకుంటే పట్టాలు ఇస్తానని కేసీఆర్ తెలిపారు. ఇన్ని రోజులు ఇదే విషయాన్ని ఎందుకు స్పష్టం చేయలేక పోయావు. హుజూర్నగర్, నాగార్జునసాగర్ ఎన్నికలప్పుడు పట్టాలు ఇస్తానని తెలిపి ఇవ్వలేదు. ఈ ఎనిమిది సంవత్సరాలు సమస్యను నాల్చింది ఎవరు. మళ్లీ ఈ సమస్యను తీసుకువచ్చింది ఎవరు? మళ్లీ వీటి అన్నింటికి కొత్త లింకులు పెడుతున్నావు. అఖిలపక్ష సమావేశం పెడతారు ఎందుకు? మీరు పట్టాలు ఇవ్వకపోతే ఈ పేద ప్రజలు నీ ఫాంహౌజ్‌ను దున్నుతారు." - బండి సంజయ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు
ఇవీ చదవండి: