గంగుల శ్రీనివాస్ మరణం తనను ఎంతగానో భాధిస్తున్నదని.. మెరుగైన చికిత్స అందించాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా కాపాడుకోలేకపోయామని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాణాలు ఎంతో విలువైనవని.. కార్యకర్తలెవరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దన్నారు. ఆత్మహత్యలు తల్లితండ్రులకు కడుపుకోత మిగులుస్తాయే తప్ప వాటి ద్వారా దేన్ని సాధించలేమని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 2023లో గోల్కొండ ఖిల్లాపై కాషాయ జెండా ఎగరడాన్ని కళ్లారా చూడడమే లక్ష్యం కావాలని అన్నారు. దాని కోసం బతికుండి పోరాటం చేయడమే మార్గంగా ముందుకు సాగాలన్నారు.
కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో కొట్లాడి ప్రజాస్వామిక తెలంగాణను నిర్మాణం చేద్దామని తెలిపారు. శ్రీనివాస్ మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని ప్రకటిస్తూ వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని ఆ భగవంతుణ్ణి ప్రార్ధిస్తున్నానన్నారు. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం తమ్మలోనిగూడెంలో ఉదయం 11 గంటలకు జరిగే శ్రీనివాస్ అంతిమయాత్రలో పాల్గొననున్నట్లు తెలిపారు.
ఇవీ చూడండి: ఆత్మహత్యాయత్నం చేసిన భాజపా కార్యకర్త గంగుల శ్రీనివాస్ మృతి