హైదరాబాద్‌లోని యాకుత్‌పురాకు చెందిన ఆరేళ్ల బాలుడిని గుర్తుతెలియని దుండగుడు ఎత్తుకెళ్లి రెండు చేతులు విరగ్గొట్టిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆసీఫ్, ఆఫ్రిన్ దంపతుల కుమారుడు నాసీర్ సోమవారం ఉదయం అదృశ్యమయ్యాడు. తల్లిదండ్రులు చుట్టుపక్కల వెతికినా జాడ దొరకలేదు. చివరకు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
కుటుంబసభ్యులు బాలుడి కోసం గాలిస్తుండగా యాకుత్‌పురా, డబీర్‌పురా మధ్య ఉన్న రైల్వే కట్ట సమీపంలోని కంప చెట్లలో నిస్సహాయ స్థితిలో నాసీర్ కనిపించాడు. రెండు చేతులు విరిగిపోయి తీవ్రగాయాలతో ఉన్న బాలుడిని ఉస్మానియా ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించారు. ఈ ఘాతుకానికి ఎవరు పాల్పడ్డారన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: 'ఇక్కడ మొండెం-అక్కడ తలభాగం'