విశాఖ పర్యటనలో తమపై వైకాపా శ్రేణులు దాడి చేశారని ఏపీ ప్రతిపక్ష నేత, తెదేపా అధినేత చంద్రబాబు మండిపడ్డారు. గంట, రెండు గంటలు ఆగితే పంపిస్తామని పోలీసులు చెప్పారని... ఇప్పుడేమో వెనక్కి వెళ్లాలని చెబుతున్నారని పేర్కొన్నారు. ఏ చట్టం కింద వెనక్కి వెళ్లాలని చెబుతున్నారో చెప్పాలని ప్రశ్నించారు. తాను చట్టాన్ని ఉల్లంఘించనని.. పూర్తిగా సహకరిస్తానని అన్నారు. న్యాయపరంగా ముందుకెళ్తామని స్పష్టం చేశారు. విశాఖలో భూకబ్జాలు జరిగాయన్న చంద్రబాబు.. నిజమో? కాదో? ప్రజలే తేలుస్తారన్నారు.
ఇదీ చదవండి: ఆ వాట్సాప్ గ్రూపుల్లోనే దిల్లీ అల్లర్లకు స్కెచ్