హైదరాబాద్ క్రికెట్ అసోషియేషన్ అధ్యక్షుడు అజారుద్దీన్ మ్యాచ్ ఫిక్సింగ్ కేసుపై... కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలుస్తామని తెలంగాణ క్రికెట్ అసోషియేషన్ అధ్యక్షుడు యెండల లక్ష్మీనారాయణ చెప్పారు. ఆ కేసు దర్యాప్తును సీబీఐ పునర్విచారణ చేయాలని కోరనున్నట్లు తెలిపారు. అజారుద్దీన్ కేవలం ఎన్నికల్లో పోటీ చేయడానికి కోర్టు నుంచి తాత్కాలిక అనుమతి మాత్రమే తీసుకున్నాడని లక్ష్మీనారాయణ పేర్కొన్నారు.
మ్యాచ్ ఫిక్సింగ్ అభియోగాల నుంచి అజారుద్దీన్ తప్పించుకోలేడని స్పష్టం చేశారు. మ్యాచ్ ఫిక్సింగ్ కేసులో బీసీసీఐ నుంచి ఆయనకు క్లీన్చిట్ లభించలేదన్నారు. ఇటీవల జరిగిన ముస్తాక్ అలీ, విజయ్ హజారే ట్రోఫీల సెలక్షన్లలో అనేక అవకతవకలు జరిగాయని ఆరోపించారు. లీగ్ మ్యాచ్‌ల్లో మంచి ప్రతిభ కనబరిచిన ఆటగాళ్లకు చోటులేకుండా పోయిందన్నారు. హైదరాబాద్ క్రికెట్ అసోషియేషన్‌కు అజార్ చేసింది శూన్యమని దుయ్యబట్టారు.
ఇదీ చూడండి : నార్త్ జోన్ ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్