ETV Bharat / state

ఏపీమంత్రి జయరాంపై అనిశాకు అయ్యన్న ఫిర్యాదు

author img

By

Published : Sep 24, 2020, 10:28 PM IST

ఏపీ కార్మికశాఖ మంత్రి జయరాంపై తెదేపా నేత అయ్యన్న పాత్రుడు అనిశాకు ఫిర్యాదు చేశారు. ఈఎస్ఐ కుంభకోణం నిందితుడికి మేలుచేసేందుకు మంత్రి కుమారుడు బెంజ్ కారు తీసుకున్నారని ఆరోపించారు. ఈ అంశంపై అనిశా విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. లేకుంటే గవర్నర్​ను కలుస్తానని స్పష్టం చేశారు.

ఏపీమంత్రి జయరాంపై అనిశాకు అయ్యన్న ఫిర్యాదు
ఏపీమంత్రి జయరాంపై అనిశాకు అయ్యన్న ఫిర్యాదు

ఈఎస్​ఐ కుంభకోణంలో కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాంకు సంబంధం ఉందంటూ కొన్ని ఆధారాలు విడుదల చేసిన తెలుగుదేశం సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు.. ఇదే విషయంపై అవినీతి నిరోధక శాఖకు ఫిర్యాదు చేశారు. ఈఎస్​ఐ కుంభకోణం నిందితుడికి మేలు చేసేందుకు... మంత్రి కుమారుడు బెంజ్ కారు తీసుకున్నారని ఆరోపించారు. తన ఆరోపణలపై టోల్‌ ఫ్రీ నెంబర్‌కు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేసినా... ముఖ్యమంత్రి కనీసం స్పందించలేదని అన్నారు.

అనిశా వద్ద అయినా న్యాయం జరుగుతుందని ఫిర్యాదు చేస్తున్నానని అయ్యన్న వ్యాఖ్యనించారు. అనిశా వద్ద కదలిక లేకపోతే గవర్నర్​ను కలుస్తామని స్పష్టం చేశారు. మంత్రి అవినీతి గురించి గవర్నర్‌కు వివరిస్తానని అయ్యన్న తేల్చిచెప్పారు. అనిశా అధికారులు విచారణ చేస్తారనే నమ్మకం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇదీచదవండి

'ఈఎస్ఐ స్కాం.. బెంజ్ మినిస్టర్ లీలలు అన్నీఇన్నీ కావు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.