ETV Bharat / state

'అప్పు చెల్లిస్తానని రమ్మన్నాడు... కత్తితో పొడిచారు' - yuvakudi pai katthitho daadi

ఆర్థిక లావాదేవీలతో అర్ధరాత్రి ఓ యువకుడిపై కత్తులతో దాడి చేసిన సంఘటన జీడిమెట్ల పోలీస్​ స్టేషన్​ పరిధిలో చోటు చేసుకుంది. తీవ్రంగా గాయపడిన బాధితుడిని స్థానిక ఆసుపత్రికి తరలించారు.

attacks on youngster for financial issues

author img

By

Published : Mar 5, 2020, 2:56 PM IST

హైదరాబాద్ జీడిమెట్ల పరిధిలోని అపురూప కాలనీలో నివాసం ఉంటున్న శ్రీనివాస రావు కెమికల్ సాల్వెంట్ వ్యాపారం నిర్వహిస్తున్నాడు. వీరికి రావాల్సిన 8 లక్షల రూపాయలను సత్యనారాయణ రాజు అనే వ్యక్తి చెల్లిస్తానని చెప్పి... శ్రీనివాస రావు కొడుకు సంతోష్​కు రాత్రి ఫోన్ చేశాడు. అనంతరం అపురూప కాలనీలోని ఆఫీస్ వద్దకు రావాలంటూ పిలిపించాడు.

4 కత్తి పోట్లు...

సంతోష్ అక్కడికి వెళ్లే సరికే పథకం ప్రకారం సంతోష్​తో వాగ్వాదానికి దిగాడు సత్యనారాయణ రాజు. తన అనుచరులు ఇమ్రాన్, ప్రణీత్​లతో కలిసి కత్తులతో సంతోష్​పై దాడి చేశాడు. 4 కత్తి పోట్లతో తీవ్రంగా గాయపడిన బాధితుడిని... స్థానికులు సమీపంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.

ప్రస్తుతం సంతోష్ పరిస్థితి నిలకడగా ఉంది. కేసు నమోదు చేసుకున్న జీడిమెట్ల పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆర్థిక లావాదేవీలే హత్యాయత్నానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు.

'డబ్బులు తిరిగిస్తానని చెప్పి కత్తితో పొడిచారు'

ఇవీ చూడండి : రాహుల్‌ సిప్లిగంజ్‌పై దాడి.. తీవ్ర రక్తస్రావం

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.