హైదరాబాద్ రవీంద్రభారతిలో అమెరికన్ తెలుగు అసోసియేషన్ ముగింపు వేడులకు అట్టహాసంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో హిమచల్‌ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ, మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ఏపీ ప్రభుత్వ చీఫ్ వీఫ్ శ్రీకాంత్‌రెడ్డి, తితిదే ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, ఏపీ మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
కృష్ణంరాజు దంపతులకు జీవిత సాఫల్య పురస్కారం
ప్రముఖ సినీ నటుడు కృష్ణంరాజు దంపతులకు జీవిత సాఫల్య పురస్కారం అందజేశారు. ఆయా రంగాల్లో విశిష్ట సేవలందించిన వారిని సేవ రత్న అవార్డ్స్‌తో ఘనంగా సత్కరించారు. అంతర్జాతీయంగా ఇంగ్లీష్ అవసరమైనా.. మాతృభాషా మనకు కన్నతల్లి అని హిమచల్‌ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. ప్రతి ఒక్కరు తెలుగులోనే మాట్లాడి.. తెలుగును ప్రోత్సహించాలని సూచించారు.
జన్మభూమి రుణం తీర్చుకునేందుకు
అమెరికాలో ఉంటున్నా... జన్మ భూమి రుణం తీర్చుకునేందుకు మన దేశాన్ని అభివృద్ధి చేసుకునేందుకు ఇక్కడ సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని కొనియాడారు మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి.
ఇదీ చూడండి:ఒప్పో 5జీ ఫోన్ విడుదల.. ధర, ఫీచర్లు ఇవే...