చైనాకు చెందిన స్మార్ట్ఫోన్ల తయారీ దిగ్గజం ఒప్పో 5జీ టెక్నాలజీలో ప్రత్యర్థి సంస్థలకు గట్టిపోటీ ఇచ్చేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా చైనా మార్కెట్లో ఒప్పో నుంచి తొలి 5జీ స్మార్ట్‌ఫోన్‌ను ఇటీవల ఆవిష్కరించింది. ప్రీమియం సెగ్మెంట్లోని రెనో శ్రేణికి కొనసాగింపుగా ఒకే సారి రెండు మోడళ్లను విడుదల చేసింది ఆ సంస్థ. రెనో 3ప్రో, రెనో 3 పేర్లతో మార్కెట్లోకి వచ్చిన ఫోన్ ధర, ఫీచర్ల వివరాలు ఇలా ఉన్నాయి.
ఒప్పో రెనో 3 ప్రో ఫీచర్లు
- 6.5 అంగుళాల డిస్ ప్లే
- ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టం
- క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 765జీ చిప్ సెట్
- 8 జీబీ ర్యామ్+128 జీబీ స్టోరేజ్ ధర 3,999 యువాన్లు (సుమారు రూ.40,000)
- 12 జీబీ ర్యామ్+256 జీబీ స్టోరేజ్ ధర 4,499 యువాన్లు (సుమారు రూ.45,000)
- వెనుకవైపు నాలుగు కెమెరాలు (48 ఎంపీ + 8 ఎంపీ + 13 ఎంపీ + 2 ఎంపీ)
- 32 మెగా పిక్సెళ్ల సెల్ఫీ కెమెరా
- ఆన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్
- 4,025 ఎంఏహెచ్ బ్యాటరీ
ఒప్పో రెనో 3 ఫీచర్లు
- 6.4 అంగుళాల అమోలెడ్ డిస్ ప్లే
- ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టం
- మీడియాటెక్ డైమెన్సిటీ 1000 ఎల్ చిప్ సెట్
- 8 జీబీ ర్యామ్ +128 జీబీ స్టోరేజ్ ధర 3,399 యువాన్లు (సమారు రూ.34,000)
- 12 జీబీ ర్యామ్ +256 జీబీ స్టోరేజ్ ధర 3,699 యువాన్లు (ధర రూ.37,000)
- వెనుకవైపు నాలుగు కెమెరాలు (48 ఎంపీ + 8 ఎంపీ + 2 ఎంపీ + 2 ఎంపీ)
- 32 మెగా పిక్సెళ్ల సెల్ఫీ కెమెరా
- ఆన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్
- 4,025 ఎంఏహెచ్ బ్యాటరీ
ఆయితే ఈ స్మార్ట్‌ఫోన్ భారత్‌లోకి వచ్చేది ఏప్పుడని ఒప్పో స్పష్టతనివ్వనప్పటికీ.. వచ్చే ఏడాది మార్చిలో దేశీయ విపణిలోకి ఈ మోడల్ రానున్నట్లు టెక్ వార్తా సంస్థలు అంచనా వేస్తున్నాయి.
ఇదీ చూడండి:కారు నడిచేది 5 శాతం.. పార్కింగ్‌లో ఉండేది 95 శాతం!