ETV Bharat / state

కరోనాపై ఇంటి నుంచే యుద్ధం.. హోం ఐసోలేషన్‌లోనే వైద్య సేవలు..

కొవిడ్‌-19 మహమ్మారిపై ఇంటి నుంచే యుద్ధం జరుగుతోంది. హోం ఐసోలేషన్‌లోనే బాధితులు వైరస్‌తో పోరాడుతున్నారు. యాక్టివ్‌ పాజిటివ్‌ కేసుల్లో సగానికి పైగా బాధితులు ఇళ్లల్లోనే ఉండి చికిత్స పొందుతున్నారు.

author img

By

Published : Jul 4, 2020, 6:34 AM IST

Updated : Jul 4, 2020, 6:52 AM IST

corona virus
corona virus

పెద్దగా కరోనా లక్షణాలు లేకుండా, ఇంట్లోనే ప్రత్యేక గది సౌకర్యం ఉన్న బాధితులకు అక్కడే ఉంచి చికిత్స అందించాలని ప్రభుత్వం ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. కొన్ని రోజులుగా వెలుగు చూసున్న కొవిడ్‌ కేసుల్లో ఎక్కువ మందిని ఇంట్లోనే ప్రత్యేకంగా ఉంచి తదనుగుణంగా చికిత్స అందిస్తున్నారు. వీరిలో పలువురు వేగంగా కోలుకుంటున్నారు.

తీవ్రత తక్కువ ఉన్నవారికి

కరోనా బాధితుల్లో జ్వరం, దగ్గు, జలుబు, గొంతునొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎదురవుతాయి. తాజాగా వస్తున్న కేసుల్లో వీటిలో అన్ని లక్షణాలు లేకపోవడం, ఉన్నా.. తీవ్రత తక్కువగా ఉన్నవారికి ఇలా చికిత్స అందిస్తున్నట్లు వైద్యారోగ్య శాఖాధికారులు చెబుతున్నారు. అత్యవసర పరిస్థితి తలెత్తితే అప్పటికప్పుడు ఆసుపత్రికి తరలిస్తున్నారు.

హోం ఐసోలేషన్‌ కిట్‌లో ఉండేవి..

  • 50 ఏళ్లలోపు ఉన్న వారికి హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ మాత్రలు
  • మల్టీవిటమిన్‌ మాత్రలు
  • విటమిన్‌ -సి
  • పారాసిటమాల్‌
  • అజిత్రోమైసిన్‌(దగ్గు, జలుబు ఉంటే)
  • మాస్క్‌, శానిటైజర్‌

ఇబ్బంది వస్తే ఫోన్‌ చేయొచ్చు

హోం ఐసోలేషన్‌లో ఉండేవారు మరుగుదొడ్డి అనుసంధానమై ఉన్న ప్రత్యేక గదిలో ఉండాలి. వీరికి ఆహారం దూరం నుంచి అందించాలి. వేడిగా ఉన్న ఆహార పదార్థాలు ఇవ్వాలి. నూనె పదార్థాలు తక్కువ తినాలి. బాధితులపై నిరంతర పర్యవేక్షణ ఉంటుంది. తొలుత వైద్యులు వెళ్లి స్టాంపింగ్‌ వేసి వైద్య సామగ్రి(కిట్‌) అందిస్తారు. వైద్య సిబ్బంది ఫోన్‌ ద్వారా ఆరోగ్య స్థితిని వాకబు చేస్తుంటారు. ఇబ్బంది ఎదురైతే స్థానిక ప్రభుత్వ వైద్యుడిని సంప్రదించేలా ఫోన్‌ నంబరు ఇస్తున్నాం.

- స్వరాజ్యలక్ష్మి, వీరాంజనేయులు, రంగారెడ్డి, మేడ్చల్‌ డీఎంహెచ్‌వోలు

ఇదీ చదవండి: రాష్ట్రంలో కరోనా విలయతాండవం... 20వేలు దాటిన కేసుల సంఖ్య

Last Updated : Jul 4, 2020, 6:52 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.