ETV Bharat / state

ప్లవ నామ సంవత్సరంలో రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూసుకున్నారా? - పంచాంగం 2021

కొత్త సంవత్సరాది అనగానే... లేత మామిడి ఆకుల తోరణాలూ, హాయిగొలిపే కోయిల గానం, జీవితసారాన్ని తెలియజేసే షడ్రుచుల ఉగాది పచ్చడీ ఎలా గుర్తుస్తాయో... తమ భవిష్యత్​ గురించి తెలుసుకోవాలనే కోరికతో పంచాంగ శ్రవణం మీద కూడా అంతే ఆసక్తి ఉంటుంది. మరీ ఈ సంవత్సరం మీ రాశి ఎలా ఉందో మీరు కూడా ఓ లుక్కేయండి.

astrology-yearly-prediction-for-2021
ప్లవ నామ సంవత్సరంలో రాశి ఫలం
author img

By

Published : Apr 13, 2021, 9:55 AM IST

Updated : Apr 13, 2021, 12:45 PM IST

  • మేషం

అశ్విని, భరణి, కృతిక 1వ పాదం

ఆదాయం 8; వ్యయం 14

రాజపూజ్యం 4; అవమానం 3

ఈ రాశి వారికి ప్లవ నామ సంవత్సరంలో గురు బలం సంపూర్ణంగా ఉంది. పేరుప్రతిష్ఠలు వస్తాయి. విజయం వరిస్తుంది. శత్రుదోషం తొలగుతుంది. జ్ఞాన లబ్ధి, ఆర్థికాభివృద్ధి, కార్యసిద్ధి ఉంటాయి. తగినంత ప్రోత్సాహం లభిస్తుంది. ఆపదలు తొలగిపోతాయి. పది మందికి బాసటగా నిలుస్తారు. గత వైభవం సిద్ధిస్తుంది. అభీష్టసిద్ధి త్వరగా కలుగుతుంది. ఆశయాలు నెరవేరతాయి. సంతానం గురించి శుభవార్తలు వింటారు. ఎదురు చూస్తున్న అంశాల్లో పురోగతి ఉంటుంది. విద్యార్థులకు విద్యావిషయంలో మంచి లాభం ఉంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో శుభం జరుగుతుంది. భూ-గృహ-వాహన యోగాలు కలిసివస్తాయి. ఆరోగ్యం బాగుంటుంది. స్థిరమైన ఫలితాలు వస్తాయి. ధైర్యంగా ఆటంకాలను అధిగమించి లక్ష్యాన్ని చేరుకుంటారు. నిరుత్సాహాన్ని దరికి రానీయవద్దు. కుటుంబ సభ్యుల సహకారం చాలావరకు కార్యసిద్ధినిస్తుంది. కుటుంబపరంగా అభివృద్ధిని సాధిస్తారు. కొన్ని విషయాల్లో ఆటంకాలు శాశ్వతంగా దూరమవుతాయి. స్థిరమైన జీవితం ఏర్పడుతుంది. మంచి వార్తలు వింటారు. అధికార యోగం సిద్ధిస్తుంది. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. శని, రాహు, కేతు శ్లోకాలు చదువుకోవాలి.

  • వృషభం

కృతిక 2, 3, 4 పాదాలు; రోహిణి, మృగశిర 1, 2 పాదాలు

ఆదాయం 2; వ్యయం 8;

రాజపూజ్యం 7; అవమానం 3

ఈ రాశి వారికి గ్రహబలం తక్కువగా ఉంది. శ్రమ అధిక మవుతుంది. అడుగడుగునా ఆటంకాలు ఎదురవుతాయి. ప్రతి అడుగూ జాగ్రత్తగా వేయాలి. అనుకున్న లక్ష్యాన్ని చేరేవరకూ శ్రమిస్తూనే ఉండండి. మొహమాటం ఇబ్బంది పెడుతుంది. బాధ్యతలను సమర్థంగా నిర్వర్తించాలి. పనితీరును మెరుగుపరుచుకోవటం ద్వారా కార్యసిద్ధి లభిస్తుంది. ఒత్తిడిని తట్టుకుంటూ ముందుకు సాగాలి. విద్యార్థులు బాగా కష్టపడాల్సి వస్తుంది. ఆత్మీయుల సూచనలు శక్తినిస్తాయి. వ్యయం పెరగకుండా చూసుకోవాలి. వ్యాపారంలో స్వయంకృషి అవసరం. ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. గురు, శని శ్లోకాలు చదువుకోవాలి. ధర్మం సదా రక్షిస్తుంది, ధైర్యంగా ముందుకుసాగండి.

  • మిథునం

మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు

ఆదాయం 5; వ్యయం 5;

రాజపూజ్యం 3; అవమానం 6

ఈ రాశి వారికి అర్థ లాభం, యశోవృద్ధి లభిస్తాయి. ముఖ్యమైన కార్యాల్లో విజయం లభిస్తుంది. భూ, గృహ, వాహన లాభాలు ఉన్నాయి. విద్యార్థులకు చక్కని విద్యాయోగం ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో స్థిరమైన ఫలితాలు లభిస్తాయి. కాలం అన్నివిధాలా సహకరిస్తుంది. కొందరి వల్ల నిరాశ ఎదురవుతుంది. ఆశయం త్వరగా నెరవేరడం ఉత్సాహాన్నిస్తుంది. పట్టువిడుపులతో ముందుకుసాగండి. కుటుంబసభ్యుల సలహాలు అవసరమవుతాయి. ఇంట్లో శుభాలు జరుగుతాయి. ప్రయాణాల్లో జాగ్రత్త. వివాదాల జోలికి పోవద్దు. శాంతచిత్తంతో సంభాషించండి. గృహ నిర్మాణపనుల్లో పురోగతి ఉంటుంది. ఆదాయమార్గాలు పెరుగుతాయి. శని, రాహు శ్లోకాలు చదువుకోవాలి. శివారాధన మంచిది.

  • కర్కాటకం

పునర్వసు 4 వ పాదం; పుష్యమి, ఆశ్లేష

ఆదాయం 14; వ్యయం 2;

రాజపూజ్యం 6; అవమానం 6

ఇష్టకార్యసిద్ధి ఉంటుంది. శ్రమకు తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో శ్రద్ధ అవసరం. అడుగడుగునా ఆటంకాలెదురవుతాయి. ధర్మబుద్ధితో ఆలోచించి తీసుకునే నిర్ణయాలు విజయాన్నిస్తాయి. ఆర్థిక విషయాల్లో శ్రద్ధ అవసరం. ముందస్తు ప్రణాళిక ద్వారా కష్టాలను అధిగమించవచ్చు. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. మోసం చేసేవారున్నారు. గతానుభవంతో పనిచేస్తే నష్టాన్ని నివారించవచ్చు. విద్యార్థులకు మిశ్రమ ఫలితం ఉంది. ఏకాగ్రతను పెంచితే ఆశించిన ఫలితాలు సాధించవచ్చు. బాధ్యతలను సమర్థంగా నిర్వహించండి. ఓర్పు, సహనం అవసరం. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఒత్తిడిని అధిగమించాలి. శని, గురు శ్లోకాలు చదువుకోవాలి. శివారాధన విజయాన్నిస్తుంది.

  • సింహం

మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం

ఆదాయం 2; వ్యయం 14;

రాజపూజ్యం 2; అవమానం 2

విశేషమైన శుభాలు ఉన్నాయి. శ్రమ ఫలిస్తుంది. మనోభీష్ట సిద్ధి కలుగుతుంది. వచ్చిన ప్రతి అవకాశాన్నీ విజయంగా మార్చుకుంటే జీవితంలో పైకి వస్తారు. ఆర్థికంగా కలిసివస్తుంది. స్థిర, చరాస్తులు వృద్ధి చెందుతాయి. ఉద్యోగంలో పదోన్నతులుంటాయి. వ్యాపారం కలిసివస్తుంది. విద్యార్థులకు ఆశించిన ఫలితాలు సిద్ధిస్తాయి. మీవల్ల కొందరికి మేలు చేకూరుతుంది. సమష్టి నిర్ణయాలు విజయాన్నిస్తాయి. వాస్తవానికి దగ్గరగా ఆలోచించి పని చేయండి. బంగారు భవిష్యత్తు లభిస్తుంది. బాధ్యతలను సమర్థంగా పూర్తి చేయండి. ధర్మదేవత మిమ్మల్ని సదా కాపాడుతుంది. శత్రువులు మిత్రులు అవుతారు. గురు, కేతు శ్లోకాలు చదువుకోవాలి. సమస్యలకు పరిష్కారం లభిస్తుంది.

  • కన్య

ఉత్తర 2, 3, 4 పాదాలు; హస్త, చిత్త 1, 2 పాదాలు

ఆదాయం 5; వ్యయం 5

రాజపూజ్యం 5; అవమానం 2

కన్యారాశి వారికి పట్టుదల చాలా అవసరం. ముఖ్యకార్యాల్లో శ్రద్ధ పెంచి ఏకాగ్రచిత్తంతో పని చేస్తేనే విజయం వరిస్తుంది. ఉద్యోగంలో శ్రమకు తగ్గ ప్రతిఫలం ఉంటుంది. సకాలంలో పనులు పూర్తిచేయాలి. ధర్మచింతనతో బాధ్యతలని నిర్వర్తించండి. చిన్న పొరపాటు జరిగినా సమస్య జటిలమవుతుంది. సొంత నిర్ణయాలు శక్తినిస్తాయి. కుటుంబసభ్యుల సలహాతో ముందుకు సాగండి. ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవాలి. బుద్ధిబలంతో ఆటంకాలను అధిగమించాలి. విద్యార్థులు పట్టుదలతో అభ్యసించాలి. వ్యయం పెరగకుండా చూసుకోవాలి. పట్టు విడుపులతో కాలానుగుణంగా నిర్ణయాలు తీసుకోవడం ద్వారా లక్ష్యాన్ని చేరుకోవచ్చు. మొహమాటం ఇబ్బంది కలిగిస్తుంది. నిరుత్సాహాన్ని దరిచేరనివ్వవద్దు. ఆశయ సాధనకు నిరంతరమైన ప్రయత్నం సాగాలి. సమాజ శ్రేయస్సు కోరి చేసే పనుల్లో దైవానుగ్రహం సిద్ధిస్తుంది. గురు, శని, రాహు శ్లోకాలు చదువుకోవాలి.

  • తుల

చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు

ఆదాయం 2; వ్యయం 8;

రాజపూజ్యం 1; అవమానం 5

తులా రాశి వారికి ఈ ఏడాది కలిసివస్తుంది. అదృష్టవంతులు అవుతారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఆశించిన ఫలితం వస్తుంది. ఆటంకాలు తొలగుతాయి. ఆగిన పనులు పునః ప్రారంభమవుతాయి. పట్టుదలతో కార్యసిద్ధిని సాధిస్తారు. కీర్తి దశదిశలా వ్యాపిస్తుంది. జీవితాశయం నెరవేరుతుంది. విద్యార్థులకు అద్భుతమైన కాలం. అధికార లాభం ఉంది. అనేక మార్గాల్లో విజయం లభిస్తుంది. ఎటుచూసినా మీదే పైచేయి అవుతుంది. తొందర పనికిరాదు. ఆపదల నుంచి బయటపడతారు. ఇంట్లోని పెద్దల సహకారం తప్పనిసరిగా తీసుకోవాలి. బుద్ధిబలంతో భారీ లక్ష్యాలను సాధిస్తారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. తగినంత విశ్రాంతి తీసుకోవాలి. శని కేతు శ్లోకాలు చదువుకోవాలి.

  • వృశ్చికం

విశాఖ 4వ పాదం; అనురాధ, జ్యేష్ఠ

ఆదాయం 8; వ్యయం 14;

రాజపూజ్యం 4; అవమానం 5

అద్భుతమైన కార్యసిద్ధి ఉంటుంది. ధర్మబుద్ధితో, పట్టుదలతో చేసే పనులు శీఘ్రఫలితాన్నిస్తాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో శ్రమకు తగ్గ ప్రతిఫలం ఉంటుంది. అధికారుల ప్రశంసలు లభిస్తాయి. ఆశించిన ధనలాభముంటుంది. ఓర్పు సహనంతో వ్యవహరిస్తే మంచి భవిష్యత్తు పొందుతారు. ఆత్మీయుల సలహాలూ సూచనలూ పనిచేస్తాయి. క్రియాశీలంగా ఆలోచించండి. పట్టింపులకు పోకుండా పనులు పూర్తయ్యే విధం చూసుకోవాలి. లక్ష్యం చేరువలోనే ఉంది. విద్యార్థులు కష్టపడితేనే ఫలితం ఉంటుంది. నూతన బాధ్యతలను స్వీకరిస్తారు. ఆర్థిక ఇబ్బందులు రాకుండా తగిన ప్రణాళికలు వేసుకోవాలి. ప్రయాణాల్లో జాగ్రత్త. గురు రాహు కేతు శ్లోకాలు చదువుకోవాలి. మనోబలం పెరుగుతుంది.

  • ధనుస్సు

మూల, పుర్వాఢ, ఉత్తరాషాఢ 1 వ పాదం

ఆదాయం 11; వ్యయం 5

రాజపూజ్యం 7; అవమానం 5

ధనుస్సురాశి వారికి ఈ ఏడాది అద్భుతమైన కార్యసిద్ధి లభిస్తుంది. ఉద్యోగంలో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు. అడుగడుగునా ఎదురయ్యే ఆటంకాలను బుద్ధి చతురతతో అధిగమిస్తారు. ఆర్థిక పురోగతి మిశ్రమంగా ఉంటుంది. అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఉత్తమ భవిష్యత్తును సాధించండి. ముందస్తు ప్రణాళికలు వేసుకోవడం మంచిది. సకాలంలో పనులు పూర్తిచేయండి. సమస్యను అర్థం చేసుకుంటూ తగిన పరిష్కారాన్ని వెతకండి. నిరుత్సాహాన్ని దరికి రానీయకుండా ఆలోచించండి. నిండు మనసుతో చేసే పనులు మంచి ఫలితాన్ని ప్రసాదిస్తాయి. ధర్మమే మిమ్మల్ని గెలిపిస్తుంది. కొన్ని విషయాల్లో ఇది పరీక్షా కాలం. విద్యార్థులకు అలసత్వం పనికిరాదు. శ్రద్ధ పెంచాలి. బాధ్యతలను సమర్థంగా నిర్వహించండి. వృత్తి ఉద్యోగ వ్యాపారాలు మిశ్రమ ఫలితాన్నిస్తాయి. సొంత నిర్ణయాలు లాభించవు. కుటుంబసభ్యుల సలహాలు విజయాన్నిస్తాయి. చెడును ఊహించవద్దు. శత్రువులపై విజయం సాధిస్తారు. వివాదాలకు దూరంగా ఉండాలి. అంకిత భావంతో పనిచేస్తే ప్రశాంతమైన జీవితాన్ని పొందుతారు. సమాజంలో తగిన గౌరవం లభిస్తుంది. శని, గురు శ్లోకాలు చదువుకోవాలి. కార్యసిద్ధి త్వరగా లభిస్తుంది.

  • మకరం

ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు; శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు

ఆదాయం 14; వ్యయం 14

రాజపూజ్యం 3; అవమానం 1

మకరరాశి వారికి అద్భుతమైన శుభ ఫలితాలు సిద్ధిస్తాయి. అదృష్టవంతులు అవుతారు. ఆర్థికంగా కలిసివస్తుంది. అద్భుతమైన వాక్శుద్ధి ఉంటుంది. చేసే పనుల్లో విజయం త్వరగా సిద్ధిస్తుంది. బంగారు భవిష్యత్తు గోచరిస్తోంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అధిక లాభాలు కనబడుతున్నాయి. ఇంటా బయటా కలిసివస్తుంది. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. గృహ వాహన యోగాలు ఉన్నాయి. విద్యార్థులకు శుభయోగం ఉంది. సుస్థిరమైన ఫలితాలనే సాధిస్తారు. గతంకన్నా యోగ్యమైన కాలం నడుస్తోంది. విశేష ధన లాభాలున్నాయి. సమాజానికి ఉపయోగపడే పనులు చేస్తారు. దానివల్ల పేరు వస్తుంది. జీవితాశయం నెరవేరుతుంది. కుటుంబసభ్యుల వల్ల కలిసి వస్తుంది. అపరిచితులను నమ్మవద్దు. వివాదాలకు దూరంగా ఉండాలి. ఆలోచించి నిర్ణయం తీసుకుంటే ఏ సమస్యారాదు. శని, రాహు శ్లోకాలు చదువుకోవాలి. విఘ్నాలు తొలగుతాయి.

  • కుంభం

ధనిష్ట 3, 4 పాదాలు; శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు

ఆదాయం 14; వ్యయం 14;

రాజపూజ్యం 6; అవమానం 1

కుంభరాశి వారికి పట్టుదలతో పనిచేస్తేనే విజయం సిద్ధిస్తుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో శ్రద్ధను పెంచండి. అడుగడుగునా ఆటంకాలు గోచరిస్తున్నాయి. ఆశయ సాధనలో ధర్మ చింతన చాలావరకు రక్షిస్తుంది. సౌమ్య సంభాషణ వల్ల ఆపదలు తొలగిపోతాయి. అధికారుల నుండి ఒత్తిడి పెరుగుతుంది. ఆర్థిక ఇబ్బందులు రాకుండా చూసుకోవాలి. కాలం వ్యతిరేకిస్తోంది. ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఉత్సాహాన్ని కూడగట్టుకుని ముందుకెళ్లాలి. విద్యార్థులు ఏకాగ్రచిత్తంతో కృషిచేయాలి. కుటుంబసభ్యుల సహకారం తప్పనిసరి. ప్రశాంతమైన మనసుతో చేసే పనులు విజయాన్నిస్తాయి. శని గ్రహ శ్లోకం చదువుకుంటే మంచిది.

  • మీనం

పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి

ఆదాయం 11; వ్యయం 5;

రాజపూజ్యం 2; అవమానం 4

బ్రహ్మాండమైన శుభయోగాలున్నాయి. తలచిన పనులు త్వరగా అవుతాయి. స్థిరాస్తి వృద్ధి చెందుతుంది. పెద్దలను మెప్పిస్తారు. ఉద్యోగాల్లో సుస్థిరమైన ఫలితాలున్నాయి. వ్యాపారం వృద్ధి చెందుతుంది. వృత్తుల్లో రాణిస్తారు. కోరుకున్న జీవితం లభిస్తుంది. అవరోధాలు తొలగిపోతాయి. సమాజంలో విశేషమైన ఖ్యాతి లభిస్తుంది. బంగారు భవిష్యత్తు సొంతమవుతుంది. ధనధాన్య యోగాలున్నాయి. గృహ వాహనాది సౌఖ్యం ఉంది. విశేష భూలాభం సూచితం. అధికార పదవీ లాభాలున్నాయి. విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధిస్తారు.మంచి పనులతో గొప్పవారు అవుతారు. గురు, కేతు శ్లోకాలు చదువుకుంటే మేలు జరుగుతుంది.

ఇదీ చూడండి: చేదు తర్వాతే తీపి.. కరోనా తర్వాతే సంతోషం

Last Updated : Apr 13, 2021, 12:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.