నగరంలోని బషీర్‌బాగ్‌లో ఉన్న చారిత్రాత్మక అమ్మవార్ల ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. కనకదుర్గ, నాగలక్ష్మీ అమ్మవారి ఉత్సవాలను ఈనెల 15వ తేదీ నుంచి 17 వరకు నిర్వహిస్తున్నట్లు దేవాదాయశాఖ అధికారులు తెలిపారు.
ఉత్సవాలలో భాగంగా గణపతిపూజ, పుణ్యవచనం, కలశాభిషేకం, సప్తశతి మహపూజ, నవ చండీయాగం నిర్వహించనున్నారు. ఈనెల 17వ తేదీన ఆన్కుట్ వేడుకలను అంగరంగ వైభవంగా జరిపేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ఆలయ అర్చకులు మనోహరశర్మ వెల్లడించారు.