ETV Bharat / state

pv statue: పీవీ ఠీవి ప్రతిబింబించేలా మెరుగులు.. విగ్రహావిష్కరణకు సన్నాహాలు - తెలంగాణ వార్తలు

హైదరాబాద్ నగరం నడిబొడ్డున పీవీ నరసింహారావు కాంస్య ప్రతిమ ప్రత్యేకంగా రూపుదిద్దుకుంటోంది. తొలిసారిగా లేజర్ సాంకేతికతో అచ్చు వేశారు. విగ్రహావిష్కరణకు చకాచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ కాంస్య విగ్రహం 16 అడుగులు ఎత్తు, 2 టన్నుల బరువుతో ఉండనుంది. దాదాపు రూ.27 లక్షల వ్యయంతో రూపొందించారు.

pv statue, pv narasimha rao
పీవీ విగ్రహావిష్కరణ, పీవీ నరసింహా రావు
author img

By

Published : Jun 22, 2021, 9:07 PM IST

తెలుగు గడ్డ ఖ్యాతిని దేశ నలుమూలలా చాటిన పీవీ నరసింహరావు కాంస్య ప్రతిమ... హైదరాబాద్ నగరం నడిబొడ్డున అత్యంత సుందరంగా రూపుదిద్దుకుంటోంది. పీవీ ఠీవి ప్రతిబింబించేలా కళాకారులు విగ్రహానికి మెరుగులు దిద్దుతున్నారు. అత్యాధునిక సాంకేతికతతో, అమెరికా నుంచి తెప్పించిన యంత్రాలతో మహాపురుషుడి అచ్చు వేశారు. పసిడి వర్ణంలో మెరిసే ఈ కాంస్య విగ్రహం 16 అడుగులు ఎత్తు, 2 టన్నుల బరువుతో ఉండనుంది. దాదాపు రూ.27 లక్షల వ్యయంతో పీవీ ప్రతిమను రూపొందించారు.

pv statue, pv narasimha rao
పీవీ ఠీవి ప్రతిబింబించేలా మెరుగులు

చకాచకా ఏర్పాట్లు

పీవీ ప్రతిమ కోసం 15 మంది కళాకారులు రాత్రింబవళ్లు కష్టపడి 17 రోజుల్లో విగ్రహాన్ని పూర్తిచేశారు. ఈ నెల 28న పీవీ జయంతి సందర్భంగా ఆయన విగ్రహాన్ని సీఎం కేసీఆర్ ఆవిష్కరించనున్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లను అధికార యంత్రాంగం చురుగ్గా చేస్తోంది. పీవీ శతజయంతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో సన్నాహాలు చేస్తున్నారు.

అదనపు ఆకర్షణ

నగరంలో పీవీ విగ్రహ ప్రతిష్ఠతో ఒకే కూడలిలో ఇద్దరు దిగ్గజాల విగ్రహాలు కొలువుదీరనున్నాయి. ఇప్పటికే పదిహేడు అడుగుల ఇందిరాగాంధీ విగ్రహ వైభవం ఆ కూడలిని అలంకరించగా.. ఇప్పుడు పదహారు అడుగుల పీవీ ప్రతిమ అదనపు ఆకర్షణగా మారనుంది. నెక్లెస్‌ రోడ్డులో పీవీ జ్ఞాన భూమి ఉండటంతో ఆ రోడ్డును పీవీఎన్‌ఆర్‌ మార్గ్‌గా ప్రభుత్వం మార్చింది. ఈ మార్గం ప్రారంభంలోనే ఆయన విగ్రహ పనులు చకచకా జరుగుతున్నాయి.

తొలిసారిగా లేజర్ సాంకేతికత

హైదరాబాద్‌ మహానగరంలో ఇప్పటివరకూ ఎన్నో భారీ విగ్రహాలుండగా... తొలిసారిగా అధునాతన లేజర్‌ సాంకేతికతను వినియోగిస్తున్నారు. అమెరికా నుంచి తెప్పించిన సీఎన్‌సీ యంత్రం ద్వారా పీవీ ముఖాన్ని తీర్చిదిద్దుతున్నారు. నమూనా చిత్రాన్ని తొలుత శత జయంతి ఉత్సవ కమిటీ సభ్యులు, రాష్ట్ర సాంస్కృతిక శాఖ అధికారులు పరిశీలించి... గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో కాంస్య విగ్రహం పనులు చేపట్టారు. విగ్రహ తయారీలో 85 శాతం కాపర్, 5 శాతం జింక్, 5 శాతం టిన్, మరో 5 శాతం లెడ్‌ను కలిపి ద్రవంగా కరిగించి రూపొందించారు.

అందంగా ముస్తాబు

పీవీ విగ్రహావిష్కరణ కోసం నెక్లెస్‌ రోటరీ కూడలి అందంగా రూపుదిద్దుకుంటోంది. ముందు భాగంలో విగ్రహం వద్దకు వెళ్లేలా మెట్లు, పీవీ మార్గ్‌ నుంచి ఎన్టీఆర్‌ మార్గ్‌ను కలుపుతూ విగ్రహం వెనుక నుంచి నడిచి వెళ్లేలా దారిని ఏర్పాటు చేశారు. నెక్లెస్‌ రోటరీ మొత్తం అందమైన గ్రిల్స్‌ ఏర్పాటు చేశారు. రకరకాల పూల మొక్కలు, అలంకరణ మొక్కలతో సుందరంగా ముస్తాబు చేశారు.

ప్రత్యేక శోభ

పీవీ విగ్రహ ఏర్పాటుతో హుస్సేన్‌ సాగర్‌ ప్రత్యేక శోభను సంతరించుకుంటోంది. హైదరాబాద్‌ − సికింద్రాబాద్‌ జంట నగరాలను కలుపుతూ ఏర్పాటైన ట్యాంకుబండ్‌పై తెలుగు తేజాల విగ్రహాలు, మధ్యలో ఎత్తైన ఏకశిలా బుద్ధ విగ్రహం, నెక్లెస్‌ రోడ్డు రూపొందింది. ఈ మార్గాల్లోనే సంజీవయ్య పార్కు, ఎన్టీఆర్‌ గార్డెన్, ఎన్టీఆర్‌ ఘాట్‌, లుంబినీ పార్కు ఏర్పటయ్యాయి. నెక్లెస్‌ రోటరీలో ఇందిరాగాంధీ విగ్రహం, అక్కడే ఇప్పుడు పీవీ విగ్రహం చేరడంతో ఆ కూడలికి కొత్త శోభ వచ్చింది. ఈ రెండు విగ్రహాలకు సమీపంలో 125 అడుగుల అంబేడ్కర్‌ విగ్రహ ఏర్పాటునకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అదీ జరిగితే అదనపు ఆకర్షణగా మారి పర్యాటకులను సాగర్‌ పరిసరాలు ఆకట్టుకోనున్నాయి.

ఇదీ చదవండి: Cm Kcr On Professor: వాసాలమర్రిలో బంగ్లాదేశ్​ ప్రొఫెసర్ ప్రస్తావన

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.