భార్గవ్‌రామ్ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై వాదనలు ముగిశాయి. ముందస్తు బెయిల్ పిటిషన్‌పై సికింద్రాబాద్ కోర్టు శుక్రవారం సాయంత్రం తీర్పు ఇవ్వనుంది. భార్గవ్‌రామ్‌కు ముందస్తు బెయిల్ ఇవ్వొద్దని పోలీసులు కోర్టును కోరారు. అపహరణ కేసులో భార్గవ్‌రామ్ ఏ-3గా ఉన్నట్లు పేర్కొన్నారు. భార్గవ్‌రామ్‌ను విచారించాల్సిన అవసరం ఉందని కోర్టు పోలీసులు తెలిపారు. మరికొంతమంది నిందితులను అరెస్టు చేయాల్సి ఉందని చెప్పారు.
భార్గవ్‌రామ్ తరఫు లాయర్లు బెయిల్ మంజూరు చేయాలని కోరారు. కేసుతో ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. ఇరు వాదనలను సికింద్రాబాద్ న్యాయస్థానం విన్నది.