ETV Bharat / state

YS SHARMILA: "సిట్​ కార్యాలయానికి వెళ్తే ఎందుకు అడ్డుకుంటున్నారు?" - తెలంగాణ వార్తలు

YS Sharmila House Arrest: విధినిర్వహణలో ఉన్న పోలీసులపై.. వైఎస్ షర్మిలతో పాటు ఆమె తల్లి విజయమ్మ చేయిచేసుకున్నారు. ఇంటి నుంచి బయటకు వెళ్లేందుకు యత్నించిన షర్మిలను.. పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. అడ్డు వచ్చిన ఎస్సైతో పాటు మహిళా కానిస్టేబుల్‌పై చేయిచేసుకున్నారు. అనంతరం ఆమెను పోలీస్ట్‌ స్టేషన్‌కి తరలించారు. అక్కడకు వెళ్లిన షర్మిల తల్లి విజయమ్మ.. పోలీసులపై చేయిచేసుకున్నారు.

YS Sharmila House Arrest
YS Sharmila House Arrest
author img

By

Published : Apr 24, 2023, 4:18 PM IST

పోలీసులపై చేయి చేసుకున్న వైఎస్ షర్మిల

YS Sharmila House Arrest: పోలీసులపై చేయిచేసుకున్న వైఎస్​ఆర్​టీపీ అధ్యక్షురాలు షర్మిలను పోలీసులు అరెస్ట్‌ చేశారు. సిట్‌ కార్యాలయాన్ని ముట్టడించిన తర్వాత.. టీ- సేవ్ నిరహారదీక్షలో భాగంగా ప్రతిపక్ష పార్టీ నేతలను కలిసి మద్దతు కోరాలని వైఎస్ షర్మిల నిర్ణయించారు. అందులో భాగంగా ఇంటి నుంచి.. షర్మిల బయలుదేరుతుండగా పోలీసులు భారీఎత్తున మెహరించి అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో పోలీసులు- షర్మిలకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. తన పనుల మీద బయటకు వెళ్తేంటే ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. బయటకు వెళ్తుండగా అడ్డుకున్న బంజారాహిల్స్‌ ఎస్సై రవిందర్‌తో పాటు మహిళా కానిస్టేబుల్‌పై షర్మిల చేయి చేసుకున్నారు. అనంతరం ఆమెను అరెస్ట్‌ చేసి.. జూబ్లీహిల్స్ పోలీస్‌ స్టేషన్‌కి తరలించారు. షర్మిల చేయిచేసుకున్న ఇద్దరు పోలీసులు బంజారాహిల్స్‌ పోోలీస్ స్టేషన్​లో పనిచేస్తుండటంతో అక్కడే కేసు నమోదుచేశారు. విధి నిర్వహణలో ఉన్న ఎస్సై, కానిస్టేబుల్​పై చేయి చేసుకున్న సెక్షన్ కింద కేసు నమోదు చేశారు.

సిట్ కార్యాలయానికి వెళ్లడానికి వచ్చా: రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదంటూ షర్మిల తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సిట్ కార్యాలయానికి ఒక్కరినే వెళ్లి.. అధికారిని కలిసి టీఎస్​పీఎస్సీ దర్యాప్తు మీద వినతి పత్రం ఇవ్వాలని అనుకున్నామని తెలిపారు. కేసు దర్యాప్తు జరుగుతున్నందున.. తమ అనుమానాలను సిట్ అధికారికి చెప్పడం.. తమ బాధ్యత అని తెలిపారు. సిట్ కార్యాలయానికి వెళ్లేందుకు ఎవరికీ చెప్పి వెళ్లాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. బయటకు వెళ్లకుండా పోలీసులు ఎందుకు అడ్డుకుంటారని ప్రశ్నించారు. తన రక్షణ కోసమే చేయిచేసుకున్నట్లు తెలిపారు. ఒక మహిళను పురుష పోలీసులు ఎలా అడ్డుకుంటారని షర్మిల ప్రశ్నించారు.

బయటకి వెళ్లకుండా పోలీసులు ఎందుకు అడ్డుకుంటున్నారు: రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదంటూ షర్మిల తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సిట్ కార్యాలయానికి ఒక్కరినే వెళ్లి.. అధికారిని కలిసి టీఎస్​పీఎస్సీ దర్యాప్తు మీద వినతి పత్రం ఇవ్వాలని అనుకున్నామని తెలిపారు. కేసు దర్యాప్తు జరుగుతున్నందున... తమ అనుమానాలను సిట్ అధికారికి చెప్పడం.. తమ బాధ్యత అని తెలిపారు. సిట్ కార్యాలయానికి వెళ్లేందుకు ఎవరికీ చెప్పి వెళ్లాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. బయటకు వెళ్లకుండా పోలీసులు ఎందుకు అడ్డుకుంటారని ప్రశ్నించారు. తన రక్షణ కోసమే చేయిచేసుకున్నట్లు తెలిపారు. ఒక మహిళను పురుష పోలీసులు ఎలా అడ్డుకుంటారని షర్మిల ప్రశ్నించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.