కడప పెద్దదర్గా ఉరుసు ఉత్సవంలో ఏఆర్ రెహమాన్... - కడప పెద్ద దర్గాను దర్శించుకున్న ఏఆర్ రెహమాన్
కడప పెద్దదర్గా ఉరుసు ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన గంధం మహోత్సవంలో... ప్రముఖ సినీ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ పాల్గొన్నారు. ఎంతో భక్తి శ్రద్ధలతో ఆయన గంధం కార్యక్రమాన్ని నిర్వహించారు. రెహమాన్‌తో పాటు ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా, జిల్లా కలెక్టర్ హరికిరణ్ హాజరయ్యారు. రెహమాన్ రాక సందర్భంగా ఎలాంటి ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. గత పదేళ్ల నుంచి క్రమం తప్పకుండా రెహమాన్ గంధం ఉత్సవంలో పాల్గొంటున్నారు.
ar rahman in kadapa pedda dargah urusu festival news in telugu
By
Published : Jan 10, 2020, 11:36 AM IST
.
కడప పెద్దదర్గా ఉరుసు ఉత్సవాల్లో పాల్గొన్న ఏఆర్ రెహమాన్
Intro:ap_cdp_18_09_peddadarga_rehaman_av_ap10040 రిపోర్టర్: సుందర్, ఈ టీవీ కంట్రిబ్యూటర్, కడప. note: సార్ విజువల్స్ ఈటీవీ వాట్సాప్ డెస్కు పంపించాను పరిశీలించగలరు.
యాంకర్: కడప పెద్ద దర్గా ఉరుసు ఉత్సవాల్లో భాగంగా ఈ రోజు రాత్రి పదిగంటలకు నిర్వహించిన గంధం మహోత్సవానికి ప్రముఖ సినీ సంగీత దర్శకుడు ఏ.ఆర్.రెహ్మాన్ పాల్గొన్నారు. గత పదేళ్ల నుంచి క్రమం తప్పకుండా రెహమాన్ గంధం ఉత్సవానికి రావడం ఆనవాయితీ. అందులో భాగంగా ఈ ఏడాది కూడా హాజరు కావడం విశేషం. వాయిద్యాల నడుమ ముస్లిం మత పెద్దల ఆశీస్సులతో గంధం తీసుకొచ్చారు. రెహమాన్ తో పాటు ఉపముఖ్యమంత్రి అంజాద్బాష కలెక్టర్ హరికిరణ్ హాజరయ్యారు. ఎంతో భక్తి శ్రద్ధలతో గంధం కార్యక్రమాన్ని నిర్వహించారు. రెహమాన్ తెల్లవారుజాము వరకు దర్గాలో ప్రార్థనలు నిర్వహిస్తారు. రెహమాన్ రాక సందర్భంగా ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.