దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా సభలకు టీపీసీసీ (TPCC) ఇంఛార్జీల నియామకం చేపట్టింది. 119 నియోజక వర్గాలకు ఇంఛార్జీలను ఎంపిక చేసింది. ఈ మేరకు ఇన్‌ఛార్జీల జాబితాను కాంగ్రెస్ నేత మహేశ్‌కుమార్ గౌడ్ విడుదల చేశారు.
ఇంద్రవెల్లిలో సభ..
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో కాంగ్రెస్ దళిత, గిరిజన దండోరా సభ నిర్వహించిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ కార్యకర్తలు, దళితులు, ఆదివాసీలతో సభా ప్రాంగణం కిటకిటలాడింది. ములుగు ఎమ్మెల్యే సీతక్క అధ్యక్షతన జరిగిన సభకు.... పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌తోపాటు సీఎల్పీనేత భట్టి విక్రమార్క సహా పార్టీ సీనియర్ నేతలు పాల్గొన్నారు. దళిత, గిరిజన రెండోసభను ఈనెల 18న రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో నిర్వహించనున్నట్లు రేవంత్ రెడ్డి ప్రకటించారు.
ఇదీ చదవండి: ఇంద్రవెల్లిలో కాంగ్రెస్ దళిత, గిరిజన దండోరా సభ.. భారీగా తరలివచ్చిన జనం