కరోనా కష్టకాలంలో వైద్యులు అందిస్తున్న సేవలు మరువలేనివని.. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 700 మంది వైద్యులు కొవిడ్ వల్ల మృత్యువాతపడ్డారని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి డా. సంజీవ్‌సింగ్ యాదవ్ అన్నారు. హైదరాబాద్ మాదాపూర్‌లోని హైటెక్స్‌లో యాక్ట్ నౌ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో పలువురు వైద్యులకు డాక్టర్ అబ్దుల్ కలాం స్మారక అవార్డులతో సన్మానించారు.
వైద్యులందరూ కమర్షియల్ కాదని.. ప్రజలకు అంకితభావంతో లాభాపేక్ష లేకుండా సేవలు అందించే వైద్యులు సమాజంలో ఎంతో మంది ఉన్నారని సంజీవ్‌సింగ్ యాదవ్ అన్నారు. కరోనా కాలంలో విశిష్ట సేవలందిస్తున్న 100 మంది వైద్యులను సన్మానించేందుకు నిర్ణయించామని అందులో 80 మందిని ఇప్పటికే సన్మానించినట్లు పేర్కొన్నారు. గొప్ప మానవతావాది అయిన అబ్దుల్ కలాం అవార్డు అందుకోవడం ఎంతో ఆనందంగా ఉందని ఆవార్డుగ్రహీతలు సంతోషం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండిః కరోనా కాలంలో.. మన విమానాశ్రయాలే భేష్!