ETV Bharat / state

కిడ్నాప్ కేసు: కర్రలతో కొట్టి పత్రాలపై సంతకాలు..

రిమాండ్​ రిపోర్ట్​: కర్రలతో కొట్టి పత్రాలపై సంతకాలు
ap former minister AKHILPRIYA REMOND REPORT
author img

By

Published : Jan 7, 2021, 2:58 PM IST

Updated : Jan 7, 2021, 4:02 PM IST

14:52 January 07

రిమాండ్​ రిపోర్ట్​: కర్రలతో కొట్టి పత్రాలపై సంతకాలు

సీఎం కేసీఆర్​ బంధువుల అపహరణ కేసులో ఏపీ మాజీ మంత్రి భూమా అఖిల ప్రియనే ప్రధాన నిందితురాలని రిమాండ్ నివేదికలో పోలీసులు తెలిపారు. హఫీజ్​పేట భూముల వివాదంలో డబ్బుల కోసం తన భర్త భార్గవ్​రామ్​, ఏవీ సుబ్బారెడ్డితో కలిసి కిడ్నాప్​నకు పాల్పడినట్లు విచారణలో అఖిలప్రియ అంగీకరించారని పోలీసులు వెల్లడించారు. తమ రాజకీయ బలంతో సాక్షులను, దర్యాప్తును ప్రభావితం చేయటంతో పాటు.. బాధితుల కుటుంబంపై దాడులకు కూడా తెగించే ప్రమాదం ఉన్నందునే అఖిలప్రియను అరెస్టు చేసినట్లు వివరించారు.  

ఏవీ సుబ్బారెడ్డి ఏ 1 అని నిన్న పేర్కొన్న పోలీసులు.. రిమాండ్ నివేదికలో మాత్రం అఖిలప్రియనే ఏ 1 నిందితురాలని కోర్టుకు నివేదించారు. ఏ 2గా ఏవీ సుబ్బారెడ్డి, ఏ3గా భార్గవ్​రామ్​గా తెలిపిన పోలీసులు శ్రీనివాస్ రావు అలియాస్ శ్రీను చౌదరి, సాయి, చంటి, ప్రకాశ్​ను మిగతా నిందితులుగా ప్రస్తావించారు. మూడు వాహనాల్లో నిందితులు వెళ్లి ప్రవీణ్ రావు ఇతర బాధితులను అపహరించినట్లు రిమాండ్ నివేదికలో వివరించారు. తమ కళ్లకు గంతలు కట్టి చేతులు కట్టేసి తీసుకెళ్లినట్లు బాధితులు పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు.

కర్రలతో కొట్టి తమతో పలు దస్త్రాలు, బ్యాంకు పత్రాలపై బలవంతంగా సంతకాలు చేయించుకున్నట్లు బాధితులు తెలిపారు. కిడ్నాప్ చేసి తీసుకెళ్తున్నప్పుడు నిందితులు అఖిలప్రియ, భార్గవ్ రామ్, సుబ్బారెడ్డి పేర్లు ప్రస్తావించారన్నారు. నిందితులు 25 నుంచి 40 ఏళ్ల మధ్య వయసులో ఉన్నారని.. తెలుగు, ఇంగ్లీషులో మాట్లాడారని బాధితులు వివరించినట్లు పోలీసులు వెల్లడించారు. కిడ్నాప్ చేసినట్లు పోలీసులు గాలిస్తున్నట్లు మీడియాలో వార్తలు రాగానే.. తమను వదిలిపెట్టాలని ఫోన్​లో నిందితులకు ఆదేశాలు వచ్చాయని బాధితులు పేర్కొన్నారు.  

దీంతో సన్ సిటీ కాళిమాత ఆలయం వద్ద వదిలేసినట్లు వివరించారు. క్యాబ్ మాట్లాడుకొని వెళ్లబోతున్న సమయంలో తాము చేరుకొని వారిని ఆస్పత్రికి తరలించామని పోలీసులు వివరించారు. హఫీజ్​పేటలోని భూమి వివాదమే కిడ్నాప్​నకు కారణంగా దర్యాప్తులో తేలినట్లు రిమాండ్ నివేదికలో పోలీసులు వెల్లడించారు. హఫీజ్ పేటలోని సర్వే నెంబరు 80లోని 25 ఎకరాల భూమిని ప్రవీణ్ రావు 2016లో కొనుగోలు చేసినట్లు పోలీసులు వివరించారు.  

ఆ భూమి తమదని అఖిలప్రియ, భార్గవ్​రామ్​, సుబ్బారెడ్డి వాదిస్తూ ప్రవీణ్ రావు ఇబ్బంది పెట్టారని తెలిపారు. ప్రవీణ్ రావు వారితో సెటిల్ చేసుకొని అఖిలప్రియ, భార్గవ్​రామ్​ తరఫున సుబ్బారెడ్డికి కొంత డబ్బులు ఇచ్చినట్లు తెలిపారు. అయితే ఇటీవల భూమి ధరలు పెరగడంతో.. మళ్లీ ఇబ్బందులకు గురి చేశారన్నారు. గతేడాది భూమిలోకి చొరబడి.. ప్రవీణ్ రావును డబ్బుల కోసం బెదిరించినట్లు మియాపూర్ పోలీస్ స్టేషన్​లో కేసు కూడా నమోదైనట్లు కోర్టుకు పోలీసులు తెలిపారు. బెదిరించి డబ్బులు వసూలు చేసేందుకు తాజాగా కిడ్నాప్ చేసినట్లు వివరించారు.

అఖిలప్రియను నిన్న ఉదయం 11.20 గంటలకు ప్రశ్నించినట్లు పోలీసులు వివరించారు. గతంలో జరిగిన సెటిల్ మెంట్ సంతృప్తిగా లేనందుకే ఈ కిడ్నాప్ చేసినట్లు అఖిలప్రియ చెప్పారని పోలీసులు పేర్కొన్నారు. అఖిలప్రియ, ఇతర నిందితులు బలమైన రాజకీయ నాయకులు కాబట్టి.. దర్యాప్తును, సాక్షులను ప్రభావితం చేసే ప్రమాదం ఉన్నందునే అరెస్టు చేసినట్లు వివరించారు. అఖిలప్రియ భర్త భార్గవ్​రామ్​ తరచుగా నేరాలకు పాల్పడుతుంటారని పేర్కొన్నారు. అఖిలప్రియను అరెస్టు చేయకపోతే.. దర్యాప్తు వివరాలను.. పరారీలో ఉన్న నిందితులకు చేరవేస్తారని.. బాధితుల కుటుంబంపై దాడులకు కూడా తెగించే ప్రమాదం ఉందని.. అందుకే అరెస్టు చేశామన్నారు. నిందితులపై ఐపీసీ 147, 120బి, 452, 419, 341, 342, 506, 365, 324, 385 రెడ్ విత్ 149 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు చెప్పారు.  

ఇదీ చదవండి: యశోద ఆస్పత్రిలో సీఎం కేసీఆర్‌కు వైద్య పరీక్షలు

Last Updated : Jan 7, 2021, 4:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.