ETV Bharat / state

curfew: ఆంధ్రప్రదేశ్‌లో మరో వారం రాత్రి కర్ఫ్యూ పొడిగింపు - curfew extension in ap

night curfew extension in Andhra Pradesh
రాత్రి కర్ఫ్యూ పొడిగింపు
author img

By

Published : Jul 20, 2021, 2:54 PM IST

Updated : Jul 20, 2021, 3:39 PM IST

14:52 July 20

ఆంధ్రప్రదేశ్‌లో మరో వారం రాత్రి కర్ఫ్యూ పొడిగింపు

ఆంధ్రప్రదేశ్​లో మరో వారం రాత్రి కర్ఫ్యూ కొనసాగించాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి​ ఆదేశించారు. రాత్రి పది గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు ఆంక్షలు విధిస్తున్నట్లు పేర్కొన్నారు. కొవిడ్​ పరిస్థితులపై సమీక్ష నిర్వహించిన జగన్... ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. కొవిడ్‌ నియంత్రణ, వ్యాక్సినేషన్‌, ఇతర అంశాలపై వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో జగన్​ సమీక్షించారు. ఉదయం 6 నుంచి రాత్రి 9 గంటల వరకు దుకాణాలు తెరవవచ్చని, రాత్రి పది నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ ఆంక్షలు అమల్లో ఉంటాయని స్పష్టంచేశారు.

అదుపులో ఉన్నా.. ఆంక్షలు తప్పనిసరి

    ఏపీలో కొవిడ్‌ పాజిటివిటీ రేటు అదుపులోనే ఉందని వెల్లడించారు. అయినా తప్పనిసరిగా అందరూ కొవిడ్​ ఆంక్షలను పాటించాలని సూచించారు. మాస్కు ధరించని వారి నుంచి రూ.100 జరిమానా విధించాలని గతంలోనే అధికారులకు సూచించారు. దుకాణాల్లో పనిచేసే సిబ్బంది నుంచి వినియోగదారుల వరకూ అందరూ మాస్కులు ధరించాల్సిందేనన్నారు. దీన్ని ఉల్లంఘిస్తే ఆ దుకాణాలకు జరిమానా విధించడమే కాదు... అవసరమైతే రెండు, మూడు రోజులపాటు మూసివేసేలా గతంలో మాదిరిగానే చర్యలు తీసుకోవాలన్నారు. 

    కొవిడ్‌ నిబంధనల ఉల్లంఘన జరుగుతున్నట్లు ఎవరైనా ఫొటో తీసి పంపినా జరిమానా విధించాలని, ఇందుకు ప్రత్యేకంగా వాట్సప్‌ నంబరు ఏర్పాటుచేయాలన్నారు. ఆంధ్రప్రదేశ్​ వ్యాప్తంగా 144 సెక్షన్‌ను కఠినంగా అమలుచేయాలని పేర్కొన్నారు. ఫీవర్‌ సర్వే నిర్వహణలో జ్వరం, ఇతర లక్షణాలు ఉన్న వారికి మాత్రమే పరీక్షలు చేయించాలని, వారికి అవసరమైన మందులు అందజేయాలన్నారు.

 కళాశాలల్లో ప్రత్యేక శిబిరాలు

     డిగ్రీ విద్యార్థులకు కళాశాలల్లోనే ప్రత్యేక శిబిరాలు నిర్వహించి, టీకాలు వేసే ప్రక్రియను కొనసాగించాలని ఆదేశించారు. ‘పాఠశాలలు తెరిచేనాటికి ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలల ఉపాధ్యాయులందరికీ వ్యాక్సినేషన్‌ పూర్తిచేయాలి. కరోనా మూడో దశ ఉందని సంకేతాలు వస్తున్నందున చిన్నపిల్లల వైద్యుల నియామకాలు త్వరితగతిన పూర్తిచేయాలి. ఆసుపత్రుల్లో అవసరమైన మందులు సిద్ధం చేయాలని.. వర్షాకాలం నేపథ్యంలో డెంగీ వంటి జ్వరాలు వచ్చే ఆస్కారం ఉన్నందున పీహెచ్‌సీలు, ఏజెన్సీ ప్రాంత వైద్యులను అప్రమత్తం చేయాలని సూచించారు. మచిలీపట్నం, అవనిగడ్డ ప్రాంతాల్లో పాముకాటు కేసులు ఎక్కువగా నమోదవుతున్నందున అవసరమైన ఇంజెక్షన్లను సిద్ధంగా ఉంచాలి’ అని జగన్ ఆదేశించారు.

Last Updated : Jul 20, 2021, 3:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.