Another complaint against Ramachandra Bharathi దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోన్న ఎమ్మెల్యేల ఎర కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఆ కేసులో నిందితుడైన రామచంద్ర భారతిపై బంజారాహిల్స్ పీఎస్‌లో మరో ఫిర్యాదు నమోదైంది. రామచంద్ర భారతిపై సిట్ ఏసీపీ గంగాధర్ ఫిర్యాదు చేశారు. విచారణ వేళ దొరికిన ఐఫోన్, ల్యాప్‌టాప్‌లో నకిలీ పాస్‌పోర్ట్ లభ్యమైందని తెలిపారు. భారత్ కుమార్ శర్మ పేరిట ఉన్న పాస్‌పోర్ట్ లభ్యమైందని ఫిర్యాదులో పేర్కొన్నారు. కర్ణాటక పుత్తూరు చిరునామాతో పాస్‌పోర్ట్ గుర్తించినట్లు వివరించారు. T9633092 పాస్ పోర్ట్ నంబర్‌గా గుర్తించారు.
ఇవీ చూడండి: