రోజురోజుకు గ్రేటర్ హైదరాబాద్ విస్తరిస్తోంది. జనాభా కోటి దాటింది. గ్రేటర్ చుట్టూ 150 కి.మీ. పరిధిలో అవుటర్ రింగు రోడ్డు(ఓఆర్‌ఆర్) ఉంది. వీటి చుట్టూ సర్వీసు, అప్రోచ్, రేడియల్ రోడ్లు రానున్నాయి. వాహనాల రద్దీ పెరుగుతోంది. శివారుల్లో తరచూ ఎక్కడో ఒక చోట ప్రమాదాలు జరుగుతున్నాయి. క్షతగాత్రుల్లో ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లే ఆర్థిక స్థోమత లేనివారిని ట్రాఫిక్‌లో ఉస్మానియా, గాంధీ ఆసుపత్రులకు తీసుకొచ్చేసరికి తీవ్ర జాప్యమవుతోంది. ఈలోపు క్షతగాత్రుణ్ని కాపాడే సమయం(గోల్డెన్ అవర్) మించిపోతోంది. ముఖ్యంగా తల, వెన్నెముకకు గాయాలైన వారికి ఈ సమయం ఎంతో కీలకం. ఈ నేపథ్యంలో అత్యవసర సమయాలతోపాటు జిల్లాల నుంచి వచ్చే రోగులకు అందుబాటులో ఉండేలా నగరం చుట్టూ ఆసుపత్రుల నిర్మించాలని భావిస్తున్నారు.
టిమ్స్‌తో అడుగులు...
- కొవిడ్ నేపథ్యంలో గచ్చిబౌలిలోని క్రీడాగ్రామంలో తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(టిమ్స్) కు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. 1500 పడకలు అందుబాటులోకి వచ్చాయి. వైద్యులు, వైద్య సిబ్బంది నియామకం కొనసాగుతోంది. ఇప్పటికే బీబీనగర్‌లో ఎయిమ్స్ వైద్య సేవలందిస్తోంది.
- శామీర్‌పేట, మేడ్చల్, కొంగరకలాన్ ప్రాంతాల్లో మరో మూడు ఆసుపత్రుల ఏర్పాటుకు ప్రణాళిక రచిస్తున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ప్రకటించారు.
- కొత్తగా మూడు ఆసుపత్రుల నిర్మాణంతో గ్రేటర్ ప్రజలకే కాకుండా...చుట్టు పక్కల జిల్లాల ప్రజలకు ఉపయుక్తంగా ఉంటుందంటున్నారు. వీలైనంత త్వరగా వీటిని ఏర్పాటు చేస్తామన్నారు.
క్షతగాత్రులను అత్యవసర విభాగానికి తీసుకొచ్చేసరికి 3-4 గంటలు పడుతోంది. కొన్నిసార్లు అంతకంటే ఎక్కువే అవుతోంది. దీంతో గోల్డెన్ అవర్ గడిచిపోయి చాలామంది ప్రాణాలకే ముప్పు వాటిల్లుతోంది. గరిష్ఠంగా గంట నుంచి 3 గంటల్లోపు ఆసుపత్రికి తీసుకొస్తేనే ప్రాణాలు కాపాడే వీలుంటుంది.
- గతంలో నిమ్స్ జరిపిన ఓ అధ్యయనం ప్రకారం.
ఇదీ చదవండిః రాష్ట్రంలో రెండు లక్షలు దాటిన కరోనా పాజిటివ్ కేసులు