మార్గశిర మాస పౌర్ణమి సందర్భంగా బుధవారం ఉదయం.. హైదరాబాద్‌లోని లంగర్‌హౌస్ హనుమాన్ దేవాలయంలో శివునికి అన్నంతో అభిషేకం నిర్వహించారు. పరమేశ్వరునికి రుద్రాభిషేకంతో పాటు 11 కిలోల బియ్యంతో అన్నం వండి చల్లార్చి అభిషేకించారు.
అర్చకుడు విశ్వనాథ శాస్త్రి ఆధ్వర్యంలో ఈ అభిషేకాలు నిర్వహించారు. అనంతరం అభిషేకించిన అన్నాన్ని భక్తులకు ప్రసాదంగా అందించారు.
ఇదీ చదవండి: యాదాద్రి ఆలయ కనుమ దారికి ఆధ్యాత్మిక హంగులు