గద్దర్‌తో అంజన్‌కుమార్ భేటీ
దిల్లీ తల్లిని గెలిపించుకుందాం... రుణం తీర్చుకుందాం.. - gaddhar
అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు తోడుగా నిలిచిన నేతలు పార్లమెంట్ పోరులోనూ మద్దతివ్వాలంటూ... సికింద్రాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి అంజన్‌కుమార్ కోరారు. ఇప్పటికే ప్రొఫెసర్ కోదండరాంను కలిసిన అంజన్‌కుమార్... తాజాగా ప్రజాగాయకుడు గద్దర్ని కలిశారు.
![దిల్లీ తల్లిని గెలిపించుకుందాం... రుణం తీర్చుకుందాం..](https://etvbharatimages.akamaized.net/etvbharat/images/768-512-2818059-846-9016842f-626f-4ea6-acdb-960da0325808.jpg?imwidth=3840)
గద్దర్‌తో అంజన్‌కుమార్ భేటీ
గద్దర్‌తో అంజన్‌కుమార్ భేటీ
ఉద్యమంలో ఒక్కచోట కూడా కన్పించని వారంతా ఇప్పడు ప్రభుత్వంలో పదవులు అనుభవిస్తున్నారని సికింద్రాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి అంజన్‌కుమార్ ఆరోపించారు. ప్రజాగాయకుడు గద్దర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. పార్లమెంట్ ఎన్నికల్లో తనకు మద్దతివ్వాలని అంజన్‌కుమార్ కోరారు. సానుకూలంగా స్పందించిన గద్దర్... తెలంగాణలో ఎంపీలను గెలిపించి సోనియాగాంధీ రుణం తీర్చుకోవాలని సూచించారు.
sample description