ETV Bharat / state

Jagan Delhi Tour: ఏపీ సీఎం జగన్ దిల్లీ పర్యటన వాయిదా

author img

By

Published : Jun 7, 2021, 7:55 AM IST

ఏపీ సీఎం జగన్ దిల్లీ పర్యటన వాయిదా పడింది. ముఖ్యనేతలతో భేటీలు ఖరారు కాకపోవడంతో పర్యటన వాయిదా పడినట్లు తెలుస్తోంది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ తేదీ ఖరారు అయ్యాకే దిల్లీ వెళ్తారని సమాచారం.

andhra-cm-jagan-mohan-reddys-delhi-tour-postponed
Jagan Delhi Tour: సీఎం జగన్ దిల్లీ పర్యటన వాయిదా

ఆంధ్రప్రదేశ్​ ముఖ్యమంత్రి జగన్ (cm jagan) నేటి దిల్లీ పర్యటన వాయిదా పడింది. దిల్లీలో ముఖ్య నేతల అపాయింట్​మెంట్లు ఖరారు కాకపోవడంతో పర్యటన వాయిదా పడింది. కొవిడ్ వాక్సినేషన్ (covid vaccination) బాధ్యతను కేంద్ర ప్రభుత్వమే తీసుకోవాలని కోరడం సహా.. పలు సమస్యల పరిష్కారంపై కేంద్ర ప్రభుత్వంతో చర్చించేందుకు సీఎం దిల్లీకి వెళ్లాలని నిర్ణయించారు. రాష్ట్రంలో 3 రాజధానుల (three capitals) ఏర్పాటు ప్రక్రియను ముందుకు తీసుకువెళ్లడంలో కేంద్ర సహకారం తీసుకోవడంపైనా చర్చించాలని భావించారు.

పోలవరం ప్రాజెక్టు (polavaram project)కు సంబంధించి పెండింగ్​లో ఉన్న బిల్లులు, కొవిడ్ (covid-19) దృష్ట్యా కేంద్రం నుంచి రాష్ట్రాలకు సాయం తదితర అంశాలపై చర్చించాలని నిర్ణయించారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit shah) బిజీగా ఉన్న కారణంగా ఆయన అపాయింట్​మెంట్ దొరకలేదని సమాచారం. అమిత్ షాతో భేటీ ఖరారయ్యాకే దిల్లీ వెళ్లనున్నారు. వచ్చే వారం రోజుల్లో సీఎం దిల్లీ వెళ్లే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

ఇదీ చదవండి: కొవిడ్​ నుంచి కోలుకున్న వారిలో కొత్త రకం వ్యాధి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.