ETV Bharat / state

ఇళ్ల స్థలాల కోసం తవ్వితే.. పురాతన శివాలయం బయటపడింది - ancient Shiva temple in repalle news

వందల ఏళ్లనాటి శివాలయం బయటపడింది. పేదలకు నివాస స్థలాలు ఇచ్చేందుకు భూములు సేకరించారు. ఆ ప్రాంతంలో ఉన్న ముళ్ల చెట్లను తొలగిస్తుండగా దేవాలయం బయటపడింది. దీనితో అక్కడి గ్రామస్థులు విగ్రహాలకు పూజలు చేశారు.

ancient-shiva-temple-in-guntur-district
ఇళ్ల స్థలాల కోసం తవ్వితే.. పురాతన శివాలయం బయటపడింది
author img

By

Published : Jun 29, 2020, 8:00 AM IST

ఆంధ్రప్రదేశ్​ గుంటూరు జిల్లా రేపల్లె మండలం కారుమూరులో పురాతన శివాలయాన్ని గుర్తించారు. గ్రామంలో పేదలకు నివేశన స్థలాలు ఇచ్చేందుకు అధికారులు రెండెకరాల భూమిని సేకరించారు. ఆ ప్రాంతంలో మార్గం కోసం కూలీలు శనివారం ముళ్లచెట్లు తొలగిస్తుండగా దేవాలయం వెలుగుచూసింది. అందులో రెండు శివలింగాలు, నంది, దేవత విగ్రహాలున్నాయి.

సమాచారం తెలుసుకొన్న గ్రామస్థులు విగ్రహాలకు పూజలు చేశారు. దాతల సహకారంతో ఆలయాన్ని పునర్నిర్మిస్తామని చెప్పారు. ఈ ఆలయం 300 వందల ఏళ్ల నాటిది అయిఉండొచ్చని గ్రామంలోని పెద్దలు అభిప్రాయపడుతున్నారు.

ఇదీ చవదవండి: పీవోకేలో చైనా విమానం- సరిహద్దులో భారీగా బలగాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.