లాక్ డౌన్ నేపథ్యంలో ఉపాధి లేక తిండికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న 50 కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు యాంకర్ రవి. హైదరాబాద్ బీఎన్ రెడ్డి నగర్లోని టీచర్స్ కాలనీలో సంచార కులాలకు చెందిన ఒక్కో కుటుంబానికి 10 కేజీల బియ్యం, నూనె, పప్పు, ఉల్లిగడ్డ, చింతపండు అందించారు. వాటితో పాటు కూరగాయలనూ అందజేశారు. విపరీత విపత్కర సమయంలో దాతలు ముందుకు రావాలని రవి కోరారు. ఎవరూ ఆకలితో అలమటించకుండా ఉండేందుకు తోటి వారికి సాయం అందించాలని రవి సూచించారు.
50 కుటుంబాలకు యాంకర్ రవి సరకుల పంపిణీ - 50 కుటుంబాలకు యాంకర్ రవి సరకుల పంపిణీ
హైదరాబాద్ బీఎన్ రెడ్డి నగర్లో అత్యంత వెనుకబడిన 50 నిరుపేద కుటుంబాలకు యాంకర్ రవి కిరాణ సరకులు అందించారు. ఆపత్కాలంలో ఎవరికీ ఆకలి బాధ లేకుండా ఉండేందుకే పంపిణీ చేసినట్లు రవి పేర్కొన్నారు.
![50 కుటుంబాలకు యాంకర్ రవి సరకుల పంపిణీ నిరుపేద కుటుంబాలకు యాంకర్ రవి బియ్యం పంపిణీ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6715374-thumbnail-3x2-ravi.jpg?imwidth=3840)
నిరుపేద కుటుంబాలకు యాంకర్ రవి బియ్యం పంపిణీ
లాక్ డౌన్ నేపథ్యంలో ఉపాధి లేక తిండికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న 50 కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు యాంకర్ రవి. హైదరాబాద్ బీఎన్ రెడ్డి నగర్లోని టీచర్స్ కాలనీలో సంచార కులాలకు చెందిన ఒక్కో కుటుంబానికి 10 కేజీల బియ్యం, నూనె, పప్పు, ఉల్లిగడ్డ, చింతపండు అందించారు. వాటితో పాటు కూరగాయలనూ అందజేశారు. విపరీత విపత్కర సమయంలో దాతలు ముందుకు రావాలని రవి కోరారు. ఎవరూ ఆకలితో అలమటించకుండా ఉండేందుకు తోటి వారికి సాయం అందించాలని రవి సూచించారు.
TAGGED:
Corona Anchor Ravi