ETV Bharat / state

పోలీసునూ వదలని కొవిడ్... వైరస్ సోకి సీఐ మృతి

author img

By

Published : Jul 14, 2020, 8:18 PM IST

Updated : Jul 14, 2020, 9:13 PM IST

ఏపీవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి విస్తృతమవుతోంది. వాళ్లూ వీళ్లూ అన్న తేడా లేకుండా అందరికీ ముచ్చెమటలు పట్టిస్తోంది. అత్యవసర సేవలు అందిస్తున్న సిబ్బందిపైనా పంజా విసురుతోంది. తాజాగా ఈ మహమ్మారి కోరలకు చిక్కిన అనంతపురం ట్రాఫిక్ సీఐ మృత్యువాత పడ్డారు.

పోలీసునూ వదలని కోవిడ్... వైరస్ సోకి సీఐ మృతి

ఆంధ్రప్రదేశ్​ అనంతపురం జిల్లా ట్రాఫిక్ సీఐ రాజశేఖర్.. కరోనా లక్షణాలతో మృతి చెందారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో నగరంలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించగా.. కర్నూలుకు తరలిస్తుండగానే ప్రాణం విడిచారని పోలీసులు తెలిపారు.

కొద్ది రోజుల క్రితం రాజశేఖర్ కుటుంబ సభ్యులకు కరోనా పాజిటివ్ పరీక్షలు నిర్వహించగా.. ఇద్దరికి నిర్ధరణ అయింది. రాజశేఖర్​కు నెగెటివ్ వచ్చింది. కానీ.. వారం రోజులుగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నందున మళ్లీ పరీక్షలు చేయించుకోగా.. వైరస్ ఉన్నట్లు తేలింది. చివరికి విషమ పరిస్థితుల్లో ఆయన కోవిడ్​కు బలయ్యారు.

ఇదీ చదవండి: హోం క్వారంటైన్​లో ఉన్నవారికి కరోనా కిట్లు

Last Updated : Jul 14, 2020, 9:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.