అనారోగ్యంతో చికిత్స పొందుతున్న ఓ వ్యక్తి ఉస్మానియా ఆస్పత్రిలో మృతి చెందాడు. మృతుడి తరఫువారు ఎవరైనా ఉంటే రాంగోపాల్‌పేట్ పోలీస్‌స్టేషన్‌లో సంప్రదించాలని పోలీసులు తెలిపారు.
ఈ నెల 19న ఎస్పీ రోడ్డు పాత ఆనంద్ టాకీస్ సమీపంలోని వెస్లీ కళాశాల వద్ద గుర్తు తెలియని వ్యక్తి ఫిట్స్ వచ్చి పడిపోయాడు. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు అతడిని ఉస్మానియాకు తరలించారు. చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మృతి చెందాడు.
మృతుడి వయసు సుమారు 40 ఏళ్లు ఉంటాయని... ఆకుపచ్చ, ఎరుపు రంగు గీతల టీ షర్టు ధరించాడని పోలీసులు తెలిపారు.
ఇదీ చూడండి: ప్రాణాలు పోయే ముందు గాంధీకి వస్తున్నారు: ఈటల