ETV Bharat / state

ఆగ్నేయ బంగాళాఖాతంలో తుపాను.. ‘ఆంఫాన్’గా నామకరణం - ఆగ్నేయ బంగాళాఖాతంలో తుపాను

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తుపానుకు ఆంఫాన్​గా నామకరణం చేశారు. వచ్చే ఐదారు రోజులు అండమాన్ సముద్రం, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పశ్చిమ్ బంగ తీరప్రాంతాల్లో ప్రతికూల వాతావరణం ఉంటుందని వాతావరణ విభాగం హెచ్చరించింది.

ఆగ్నేయ బంగాళాఖాతంలో తుపాను
ఆగ్నేయ బంగాళాఖాతంలో తుపాను
author img

By

Published : May 17, 2020, 12:03 AM IST

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుపానుగా మారింది. వాతావరణ శాఖ దీనికి ఆంఫాన్​గా నామకరణం చేసింది. ప్రస్తుతం ఇది ఒడిశాలోని పారాదీప్​కు 1000 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్టు ఐఎండీ తెలిపింది.

గంటకు 16 కిలోమీటర్ల వేగంతో ఇది ఉత్తర ఈశాన్య దిశగా కదులుతున్నట్టు స్పష్టం చేసింది. ఇది మరింత బలపడి తీవ్ర తుపానుగా మారే సూచనలు ఉన్నట్టు స్పష్టం చేసింది. ఇది ఈశాన్య వాయవ్య దిశగా కదిలి, ఆపై మే 18-20 మధ్య వాయవ్య బంగాళాఖాతం మీదుగా పశ్చిమ్ బంగ తీరం వైపు తిరుగుతుందని ప్రాంతీయ ప్రత్యేక వాతావరణ కేంద్రం తెలిపింది.

వచ్చే ఐదారు రోజులు అండమాన్ సముద్రం, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పశ్చిమ్ బంగ తీరప్రాంతాల్లో ప్రతికూల వాతావరణం ఉంటుందని వాతావరణ విభాగం హెచ్చరించింది. అండమాన్, నికోబార్ దీవులు, ఒడిశా, గంగా తీరప్రాంత పశ్చిమ్ బంగలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ‘ఆంఫాన్’ ముంచుకొస్తున్న నేపథ్యంలో తీర ప్రాంత రాష్ట్రాలను కేంద్రం అప్రమత్తం చేసింది తీరప్రాంతంలోని అన్ని జిల్లాల కలెక్టర్లను అప్రమత్తం చేసింది. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని కోరింది. దక్షిణానికి ఆనుకొని ఉన్న మధ్య బంగాళాఖాతం, అండమాన్ సముద్రం అల్లకల్లోంగా ఉంటుంది కాబట్టి జాలర్లు చేపల వేటకు వెళ్లవద్దని, ఈ ప్రాంతాల మీదుగా సముద్రంలో ఉన్నవారు తీరాలకు తిరిగి చేరుకోవాలని ఏపీ ప్రభుత్వం సూచించింది.

ఇదీ చూడండి : ముద్దు పెట్టినందుకు వెంటాడుతున్న కరోనా..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.