Amit Shah Speech at Telangana Liberation Day 2023 in Hyderabad : కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించిన తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలకు (Telangana Liberation Day) కేంద్ర హోం మంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తొలుత జాతీయ జెండాను ఎగురవేసిన ఆయన.. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు. భారత్ మాతా కీ జై అంటూ అమిత్ షా తన ప్రసంగాన్ని ప్రారంభించారు. హైదరాబాద్ విమోచనం కోసం పోరాడిన అమరవీరులకు ప్రణామం అని అన్నారు.
Telangana Liberation Day Celebrations 2023 : ఈ సందర్భంగా తెలంగాణ విమోచన దినోత్సవం గురించి దేశ ప్రజలందరికీ తెలియాలని అమిత్ షా (Amit Shah ) పేర్కొన్నారు. సాయుధ పోరాట యోధులకు అందరూ శ్రద్ధాంజలి ఘటించాలని అన్నారు. హైదరాబాద్ విముక్తి కోసం పోరాడిన అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటిస్తున్నానని.. ఇందుకోసం ఎందరో ప్రాణత్యాగాలు చేశారని గుర్తు చేశారు. భారత్‌లో హైదరాబాద్ విలీనానికి కృషి చేసిన వల్లభ్‌భాయ్ పటేల్‌కు నమస్కరిస్తున్నట్లు వివరించారు. ఆయన లేకపోతే తెలంగాణకు ఇంత త్వరగా విముక్తి లభించేది కాదని అమిత్ షా పేర్కొన్నారు.
Amit Shah at TS Liberation Day celebrations : తెలంగాణ అమరవీరులకు అమిత్ షా ఘననివాళి
రక్తం చిందకుండా నిజాం రజాకారులు లొంగిపోయేలా సర్దార్ వల్లభ్‌భాయ్‌పటేల్ చేశారని అమిత్ షా గుర్తు చేశారు. ఈ ప్రాంత విముక్తి కోసం నరసింహారావు, కాళోజీ, రావి నారాయణరెడ్డి వంటి మహనీయులు కృషి చేశారని పేర్కొన్నారు. కల్యాణ్ కర్ణాటక, మహారాష్ట్ర ప్రజలకు ఒక్కటి చెప్పదలుచుకున్నా అని.. మన కోసం పూర్వీకులు చేసిన బలిదానాలను భావితరాలకు అందించాలని అన్నారు. మహనీయుల స్వప్నం సాకారం దిశగా ముందుకెళ్దామని అమిత్ షా సూచించారు.
Amit Shah Speech on TS Liberation : 'విమోచన వేడుకలు జరపడానికి ఎవరూ సాహసించలేదు'
ఓటు బ్యాంకు రాజకీయాల కోసం గత పాలకులు తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు నిర్వహించలేదని అమిత్ షా ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినాన్ని సేవా దినంగా జరుపుకుంటున్నామని చెప్పారు. ప్రధాని పుట్టినరోజు కానుకగా అమిత్ షా 173 మంది దివ్యాంగులకు బ్యాటరీ సైకిళ్లను పంపిణీ చేశారు. మోదీ నేతృత్వంలో భారత్ దూసుకుపోతోందని వివరించారు. 2014కు ముందు 11వ స్థానంలో ఉన్న భారత్ ఐదో స్థానానికి చేరిందని తెలిపారు. జీ 20 సమావేశాల ద్వారా భారత్ సంస్కృతి విశ్వవ్యాప్తం చేశామని అమిత్ షా వెల్లడించారు.
"హైదరాబాద్ విముక్తి కోసం పోరాడిన అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటిస్తున్నా. హైదరాబాద్ విముక్తి కోసం ఎందరో ప్రాణత్యాగాలు చేశారు. భారత్‌లో హైదరాబాద్ విలీనానికి కృషి చేసిన వల్లభ్‌భాయ్ పటేల్‌కు నమస్కరిస్తున్నా. వల్లభ్‌భాయ్ పటేల్ లేకపోతే తెలంగాణకు ఇంత త్వరగా విముక్తి లభించేది కాదు. రక్తం చిందకుండా నిజాం రజాకార్లు లొంగిపోయేలా చేశారు. విముక్తి కోసం నరసింహారావు, కాళోజీ , రావి నారాయణరెడ్డి వంటి మహనీయులు కృషి చేశారు. మహనీయుల స్వప్నం సాకారం దిశగా ముందుకెళ్దాం. ప్రధాని మోదీ నేతృత్వంలో భారత్ దూసుకుపోతోంది." - అమిత్ షా, కేంద్ర హోం మంత్రి
Amit Shah Reached Hyderabad : హైదరాబాద్‌లో అమిత్ షా.. పీవీ సింధుతో భేటీ..