కరోనా రెండో దశతో అతలాకుతలమవుతున్న భారత్‌ను ఆదుకునేందుకు ప్రపంచవ్యాప్తంగా మద్దతు లభిస్తోంది. ఈ నేపథ్యంలో అమెరికా తెలుగు సంఘం కరోనా పోరాటంలో భారత్‌కు సహాయం అందించేందుకు ముందుకు వచ్చింది. ఇందుకోసం అమెరికా తెలుగు సంఘం కొవిడ్ డిజాస్టర్ హెల్ప్ సర్వీసెస్ ద్వారా సేవ కార్యక్రమాలు చేస్తోంది.
రెండోదశలో కరోనా బాధితులు... ఆక్సిజన్ స్థాయిలు పడిపోయి తీవ్ర ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఆక్సిజన్ కొరత తీర్చేందుకు కాన్సంట్రేటర్లను అమెరికా నుంచి ఇండియాకు పంపించింది. ఈ సందర్భంగా అమెరికా తెలుగు సంఘం ఇండియా ప్రతినిధులుగా ఉన్న లోహిత్కుమార్, శ్రీనివాస్ బండారు, కృష్ణరెడ్డి తదితరులు ఆక్సిజన్ కాన్సంట్రేటర్ల పంపిణీకి అన్ని ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. వీటిని జిల్లా కలెక్టర్ సమక్షంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వాసుపత్రులకు అందజేస్తామని వెల్లడించారు. ఆక్సిజన్ కాన్సంట్రేటర్ల వల్ల కానీ... ఒకరి ప్రాణాలైన కాపాడితే అదే చాలు అంటున్నారు.
ఇదీ చదవండి: రాగల రెండు రోజుల్లో తేలికపాటి వర్షాలు