రాష్ట్ర ప్రభుత్వ పనితీరును ఎండగడుతూ అఖిలపక్షాలు చేపట్టిన ప్రగతి భవన్ ముట్టడి, ముఖ్యమంత్రీ మేలుకో... ప్రజల ఆరోగ్యం కాపాడు... పేదల బతుకులను రక్షించు అంటూ చేసిన కార్యక్రమాలు విజయవంతం అయ్యాయని అఖిలపక్షం నేతలు అన్నారు. తెజస అధ్యక్షుడు కోదండరాం అధ్యక్ష్యతన సీపీఎం రాష్ట్ర కార్యాలయంలో జరిగిన సమావేశానికి తెదేపా అధ్యక్షుడు ఎల్. రమణ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట రెడ్డి, సీపీఐఎమ్ఎల్ న్యూ డెమోక్రసీ నేత గోవర్ధన్, తదితరులు హజరయ్యారు. ఈనెల 14న భవిష్యతు కార్యచరణను ప్రకటిస్తామని నేతలు తెలిపారు.
ఇదీ చదవండి: 'కోజికోడ్ విమానాశ్రయ రన్వే సురక్షితమైనదే'