ETV Bharat / state

చిలకలగూడ గణపతికి.. అఖిషా  ఫౌండేషన్​ ప్రత్యేక పూజలు!

సికింద్రాబాద్​ పరిధిలోని చిలకలగూడ మున్సిపల్​ గ్రౌండ్​లో ఏర్పాటు చేసిన  గణపతి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అఖిషా ఫౌండేషన్​ ఆధ్వర్యంలో వెయ్యి కొబ్బరికాయలు, గరికలతో ఘనంగా పూజలు నిర్వహించారు. మహా మృత్యుంజయ  హోమం కూడా నిర్వహించినట్టు  ఫౌండేషన్​ ఛైర్మన్​ బండపల్లి సతీష్​ తెలిపారు.

Akheesha Foundation Help Special Pooja In chilkalguda Ganesh
చిలకలగూడ గణపతికి.. అఖిషా  ఫౌండేషన్​ ప్రత్యేక పూజలు!
author img

By

Published : Aug 28, 2020, 11:13 AM IST

సికింద్రాబాద్​ పరిధిలోని చిలకలగూడ మున్సిపల్​ గ్రౌండ్​లో ఏర్పాటు చేసిన గణపతి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అఖిషా ఫౌండేషన్​ ఆధ్వర్యంలో గణనాధుడికి వెయ్యి కొబ్బరికాయలు, గరిక సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహా మృత్యుంజయ హోమం నిర్వహించి భక్తులంతా క్షేమంగా ఉండాలని కోరుకున్నట్టు ఫౌండేషన్​ ఛైర్మన్​ బండపల్లి సతీష్​ తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భాజపా ఎమ్మెల్సీ రామచంద్రారావు హాజరై ప్రత్యేక పూజలు చేశారు. కరోనా వైరస్​ నేపథ్యంలో హిందువుల పండుగలన్నీ మరుగున పడ్డాయని, భక్తులంతా భౌతిక దూరం పాటించి, జాగ్రత్తలు తీసుకుంటూ పూజల్లో పాల్గొనాలని ఆయన సూచించారు. మండపం వద్ద ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటూ ఉత్సవాలు నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. కరోనా మహమ్మారి పీడ త్వరగా వీడాలని గణనాధుడిని వేడుకున్నట్టు, వెయ్యి కొబ్బరికాయలు, మహా హారతి నిర్వహించినట్టు ఆయన తెలిపారు.

ఇవీ చూడండి: పారిశ్రామిక పార్కులకు కేంద్ర సహకారం కావాలి: కేటీఆర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.