రాష్ట్రంలో ఆరోగ్య అత్యవసర పరిస్థితిని ప్రకటించాలని కోరుతూ సీఎం కేసీఆర్‌కు ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ రాశారు. ఆరోగ్యశాఖపై పట్టున్న ప్రజాప్రతినిధికే మంత్రిగా అవకాశం కల్పించాలని దాసోజు విజ్ఞప్తి చేశారు. జిల్లా, రాష్ట్ర స్థాయిలో 24 గంటలు పనిచేసే కొవిడ్ వార్ రూమ్‌ను ఏర్పాటు చేయాలని కోరారు. 1000 టీకా కేంద్రాలతో ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేయాలని, వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికీ పరీక్షలు నిర్వహించడంతో పాటు టీకాలు అందించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.
నిధులు కేటాయించాలి..
కొవిడ్- 19 కారణంగా తమ వాళ్లను కోల్పోయిన కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించి, కరోనాను ఆరోగ్య శ్రీ పథకం కింద చేర్చాలని శ్రవణ్ డిమాండ్ చేశారు. కొవిడ్ మందులు బ్లాక్ మార్కెటింగ్ బారిన పడకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. వైద్యులు, నర్సులు, పారా మెడికల్ సిబ్బందిని నియమించాలని అన్నారు. జిల్లా స్థాయి ఆస్పత్రులతో పాటు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వాస్పత్రులకు తగిన నిధులు కేటాయించాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి: అపోలో డయాగ్నస్టిక్ ల్యాబ్‌లో తప్పుడు నివేదికలు