రాష్ట్రంలో ఇవాళ్టి నుంచి మరో రెండురోజులు తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. ఉత్తర ఒరిస్సా, దాని పరిసర ప్రాంతాలలో 1.5కి.మీ నుంచి 2.1 కిలోమీటర్ల మధ్య ఏర్పడిన ఉపరితల ఆవర్తనం బలహీనంగా మారిందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
తెలంగాణలో ప్రధానంగా ఆగ్నేయ దిశ నుంచి గాలులు వీస్తుండగా.. ఆంధ్రప్రదేశ్లో తూర్పు దిశ నుంచి గాలులు వీస్తున్నాయని వాతావరణ కేంద్రం పేర్కొంది. కోస్తాంధ్ర, యానాం ప్రాంతాల్లో ఇవాళ తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. రాయలసీమ ప్రాంతంలో రాగల మూడు రోజులు తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించారు.
ఇవీ చూడండి: చిరుజల్లు పలకరించింది... నగరం మురిసిపోయింది!