హైదరాబాద్ మీర్పేట్ పీఎస్ పరిధిలోని రాఘవేంద్ర నగర్ కాలనీలో కల్తీ నెయ్యి తయారీ కేంద్రంపై పోలీసులు దాడి చేశారు. గత కొంతకాలంగా గుట్టు చప్పుడు కాకుండా కల్తీ నెయ్యి తయారు చేస్తున్నారనే సమాచారం మేరకు మీర్పేట్ పోలీసులు దాడి చేశారు.
ఒకరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు... సుమారు 3.5 లక్షల విలువైన, కల్తీ నెయ్యి, తయారీ సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న నిర్వహకుడి కోసం గాలిస్తున్నారు.
ఇవీ చూడండి: చదువు చాటున గంజాయ్... సరఫరా, వినియోగంలో విద్యార్థులు ముందు!