ETV Bharat / state

గ్రీన్​ ఇండియా ఛాలెంజ్​లో యువ కథానాయిక రెజీనా - ఎంపీ సంతోశ్​ కుమార్ గ్రీన్​ ఇండియా కార్యక్రమం

Regina participated in the Green India Challenge: హరిత తెలంగాణ దిశగా ఎంపీ సంతోశ్​ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్​కు మంచి ఆదరణ లభిస్తోంది. ఇప్పటికే ఈ కార్యక్రమంలో స్టార్​ హీరోలతో పాటు రాజకీయ నాయకులు పాల్గొనగా తాజాగా టాలీవుడ్​ యువ కథానాయిక రెజీనా గ్రీన్​ ఇండియా కార్యక్రమంలో భాగస్వామ్యం అయ్యింది. తన సహ నటి ప్రగ్నాజైస్వాల్​ సవాల్​ను స్వీకరించిన రెజీనా తన తాజా చిత్రం శాకిని డాకిని నిర్మాతతో కలిసి రాక్​ హైట్స్​ ప్రాంగణంలో మెుక్కలు నాటారు.

Actress Regina
Actress Regina
author img

By

Published : Sep 13, 2022, 9:33 PM IST

Regina participated in the Green India Challenge: ఇప్పటికే కోట్ల హృదయాలను కదిలించిన గ్రీన్​ ఇండియా ప్రోగ్రాం ఇటు టాలీవుడ్​తో పాటు బాలీవుడ్​, కోలీవుడ్​ ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఇప్పుడు తాజాగా టాలీవుడ్​ యువ కథానాయిక రెజీనా ఈ ఛాలెంజ్​ని స్వీకరించింది. తన సహ నటి ప్రగ్నాజైస్వాల్​ సవాల్​ని స్వీకరించిన రెజీనా తన తాజా చిత్రం శాకిని డాకిని చిత్ర నిర్మాత సునీతతో కలిసి రాక్​ హైట్స్​లో మెుక్కలు నాటారు. ఈ ఉద్యమంలో భాగస్వామిగా ఉండటం చాలా సంతోషంగా ఉందని ఆమె అన్నారు. ఈ హరిత ఉద్యమం ఎంతో ఉద్ధృతంగా సాగుతుండటం చాలా గర్వకారణంగా ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. అలాగే నివేదా థామస్​ను గ్రీన్​ ఇండియా ఛాలెజ్​ తీసుకోవాల్సిందిగా రెజీనా సవాల్​ విసిరారు.

ఈ కార్యక్రమం చాలా స్పూర్తిదాయకమని ఎందరో ప్రముఖులను కదిలిస్తోందని శాకిని డాకిని చిత్ర నిర్మాత సునీత అన్నారు. ఈరోజు నాకు చాలా ఇష్టమైన వేప, పారిజాతం మెక్కలు ఇక్కడ నాటడం చాలా సంతోషంగా ఉందని ఆమె పేర్కొన్నారు. అలాగే ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్​ను దొంగలు ఉన్నారు జాగ్రత్త సినిమా హీరో శ్రీసింహా, కీరవాణి తనయుడు కాలబైరవులను తీసుకోవాల్సిందిగా ఆమె కోరారు.

ఇప్పటికే ఈ ఛాలెంజ్​ను ఇటు టాలీవుడ్​ ప్రముఖులతో పాటుగా బాలీవుడ్​లో అమిర్​ఖాన్​, బిగ్​బీ అమిత్​బచ్చన్​ లాంటి ఎందరో ప్రముఖులు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యులు అయ్యారు. అంతే కాకుండా ఎందరో రాజకీయ నాయకులు సైతం ఇందులో పాల్గొన్నారు.

గ్రీన్​ ఇండియా ఛాలెంజ్​లో పాల్గొన్న నటి రెజీనా

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.