ప్రముఖ సినీ నటుడు శ్రీకాంత్ కుటుంబ సమేతంగా దీపావళి వేడుకలను ఫిల్మ్‌నగర్‌లోని తన నివాసంలో జరుపుకున్నారు. అభిమానులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. సంప్రదాయ దుస్తుల్లో టపాసులు కాల్చారు. పండుగను ప్రతి ఒక్కరు ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. వాతావరణ కాలుష్యం పెరిగిపోతున్న నేపథ్యంలో టపాసులు ఎక్కువగా కాల్చకపోవడమే మంచిదని సూచించారు.
ఇవీ చూడండి: దివ్వెల కాంతులు... టపాసుల జిలుగులు...