ETV Bharat / state

Shamirpet Gun Firing Case Updates : శామీర్​పేట్ కాల్పుల ఘటన.. రిమాండ్​ రిపోర్టులో కీలక అంశాలు - Film actor Manoj Kumar remand report

Shamirpet Gun Fire Incident Updates : శామీర్‌పేట్‌ కాల్పుల కేసులో నటుడు మనోజ్‌కుమార్ రిమాండ్ రిపోర్ట్‌లో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. తన బంధానికి అడ్డొస్తున్నాడనే ఉద్దేశంతో సిద్ధార్థ్‌ దాస్‌ను హతమార్చేందుకు మనోజ్ ప్రయత్నించాడని పోలీసులు తెలిపారు.

actor Manoj Kumar
actor Manoj Kumar
author img

By

Published : Jul 17, 2023, 9:28 AM IST

Actor Manoj kumar Remand Report : శామీర్‌పేట్ సెలబ్రిటీ విల్లాలో కాల్పులు జరిపిన కేసులో.. నటుడు మనోజ్‌కుమార్ నాయుడు అలియాస్ సూర్యతేజ్ రిమాండ్ రిపోర్ట్‌లో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. తన బంధానికి అడ్డొస్తున్నాడనే ఉద్దేశంతో సిద్ధార్థ్‌ దాస్‌ను హతమార్చేందుకు ప్రయత్నించాడని పోలీసులు నిర్ధారించారు. 2003లో స్మిత గ్రంధితో.. సిద్ధార్థ్ దాస్‌కు వివాహం జరిగిందని తెలిపారు. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారని చెప్పారు.

గతంలో దంపతులిద్దరూ హైదరాబాద్‌లోని మూసాపేటలో నివాసం ఉండేవారని పోలీసులు తెలిపారు. మనస్పర్థలతో 2019లో స్మిత విడాకులకు దరఖాస్తు చేశారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే తానుండే ప్రాంతానికి సిద్ధార్థ్ రాకుండా న్యాయస్థానం నుంచి ఆదేశాలు తెచ్చుకున్నారని చెప్పారు. అప్పటినుంచి భార్యభర్తలు విడివిడిగా జీవిస్తున్నట్లు వివరించారు. మరోవైపు ఆమె బుద్ధిజం పేరుతో మానసిక సమస్యలకు కౌన్సిలింగ్‌ ఇచ్చేవారని పోలీసులు రిమాండ్ రిపోర్ట్‌లో వెల్లడించారు.

  • Shamirpet Gun Firing Update: 'శామీర్​పేట్'​ కాల్పుల ఘటన.. నిందితుడికి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్

Shamirpet Gun Fire Incident Updates : ఇదే సమయంలో మానసిక ఒత్తిడితో సతమతమవుతున్న, విజయనగరం జిల్లా రాజాంకు చెందిన మనోజ్‌ ఫేస్‌బుక్‌ ద్వారా స్మితను సంప్రదించాడని పోలీసులు తెలిపారు. అనంతరం ఆమె దగ్గర కౌన్సిలింగ్‌ తీసుకున్నాడని చెప్పారు. ఈ క్రమంలోనే స్మిత తన వ్యక్తిగత జీవితాన్ని పంచుకోవడంతో ఇద్దరూ దగ్గరయ్యారని వెల్లడించారు. మరోవైపు భర్తతో వేరుగా ఉంటున్న స్మిత 2020లో ప్రశాంత్‌ అనే వ్యక్తితో కలిసి కన్సల్టెన్సీ సేవల సంస్థను ప్రారంభించారని పోలీసులు వివరించారు.

సంస్థ నుంచి ప్రశాంత్‌ వెళ్లిపోయాక స్మిత, మనోజ్‌ ఇద్దరూ కలిసి నిర్వహించారని పోలీసులు చెప్పారు. వచ్చిన లాభాలతో 2021లో శామీర్‌పేట్‌ లోని సెలబ్రిటీ విల్లాలో ఇల్లు కొని అక్కడే కార్యాలయం నిర్వహిస్తూ, నివాసంగానూ ఉపయోగించేవారని పేర్కొన్నారు. స్మిత ఇద్దరు పిల్లల చదువుల విషయంలో మనోజ్‌ కఠినంగా వ్యవహరించేవాడని వెల్లడించారు. స్మిత కుమారుడు ఇంటర్‌లో ఫెయిలయ్యాడని మనోజ్‌ కొట్టాడని పోలీసులు వివరించారు.

దీంతో స్మిత కుమారుడు ఇంటి నుంచి వెళ్లిపోయి స్నేహితుల దగ్గర ఉంటున్నాడని పోలీసులు తెలిపారు. జులై 12న తనను మనోజ్‌ వేధిస్తున్నాడంటూ బాలల సంరక్షణ కమిటీకి.. ఆ బాలుడు లిఖిత పూర్వక ఫిర్యాదు ఇచ్చాడని వివరించారు. తన చెల్లిల్ని కూడా వేధిస్తున్నారని తండ్రికి, సీడబ్ల్యూసీకి చెప్పాడు. ఈ క్రమంలోనే కుమార్తెను చూసేందుకు విశాఖలో ఉంటున్న సిద్ధార్థ్‌ దాస్‌ శనివారం తెల్లవారుజామున శామీర్‌పేటలో స్మిత, మనోజ్‌ ఉండే నివాసానికి వెళ్లాడని పేర్కొన్నారు.

Shamirpet Gun Firing Case Updates : ఇదే అదనుగా సిద్ధార్థ్‌ను హతమార్చి తమ బంధానికి అడ్డుతొలగించుకోవాలని మనోజ్‌ నిర్ణయించుకున్నాడని పోలీసులు రిమాండ్ రిపోర్ట్‌లో పేర్కొన్నారు. తనకు స్నేహితుడు బహుమతిగా ఇచ్చిన ఎయిర్‌గన్‌తో సిద్ధార్థ్‌పై కాల్పులు జరిపాడని చెప్పారు. ఈ క్రమంలోనే సిద్ధార్థ్ అక్కడి నుంచి పారిపోయి ప్రాణాలు దక్కించుకొని, పోలీసులకు ఫిర్యాదు చేశారని రిమాండ్ రిపోర్ట్‌లో వెల్లడించారు.

ఇవీ చదవండి: gun firing at shamirpet : శామీర్‌పేట్‌ సెలబ్రిటీ క్లబ్‌లో కాల్పుల కలకలం.. కుటుంబ కలహాలే కారణం

హైదరాబాద్‌ శివారులో తెరాస నాయకులు కాల్పులు, వీడియో వైరల్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.