ఈఎస్‌ఐ మందుల కుంభకోణంలో నిందితులపై అవినీతి నిరోధక శాఖ అధికారులు మరో కేసు నమోదు చేశారు. ఈ కుంభకోణంలో నిందితులు ఐఎంఎస్ మాజీ సంచాలకురాలు దేవికారాణి, సంయుక్త సంచాలకురాలు పద్మ, నిందితులు శ్రీహరిబాబు, సుజాత, సాగర్ రెడ్డి, వెంకటేశ్వర్లు, నాగరాజుల ఇళ్లు, కార్యాలయాల్లో అనిశా అధకారులు మరోసారి సోదాలు నిర్వహించారు.
డొళ్ల కంపెనీల ద్వారా మూడు వేల రూపాయలు విలువ చేసే వైద్య కిట్లను ఒక్కొక్కటి 13 వేలకు కొనుగోలు చేసినట్లు బయటపడింది. అందుకు సంబంధించి నకిలీ బిల్లులు కూడా సృష్టించినట్లు గుర్తించారు. ఈ వ్యవహారంలో తవ్వుతున్న కొద్దీ అక్రమాలు బయటపడుతుండటం వల్ల మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల అక్రమాస్తులపై కూడా అనిశా దృష్టి సారించింది. ఆ కోణంలోనూ విచారణ చేస్తున్నారు.
ఇదీ చూడండి : పురోగతి: కీసర నాగరాజు కేసులో ఇతర అధికారులు