ర్యాంకుల గందరగోళంపై ఎంసెట్ అధికారులు బాధ్యతలు తీసుకోవాలని ఏబీవీపీ నాయకులు డిమాండ్ చేశారు. హైదరాబాద్ జేఎన్టీయూలోని ఎంసెట్ కార్యాలయం ఎదుట బైఠాయించి సమస్యను త్వరగా పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
సమస్య తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అధికారులు నిర్లక్ష్యం వహించారని.. ముందుజాగ్రత్త చర్యలు తీసుకుని విధులు సక్రమంగా నిర్వహించి ఉంటే ఇలాంటి సమస్యలు వచ్చేవి కావని వారు ఆరోపించారు.
ఇదీ చూడండి: ఇంటర్ బోర్డు నిర్లక్ష్యంతో విద్యార్థుల జీవితం అగమ్యగోచరం: సీపీఐ